మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ పారదర్శకంగా ఆన్ లైన్‌లోనే ఉంచామన్నారు. వైసీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు. డీఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడారు.

'మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్ధులు తయారవుతారని మేం విశ్వసించాం. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్నాం. ఐటీని ప్రోత్సహించటం ద్వారా టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశాం. విద్య రంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించింది. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది మొదట ఎన్టీఆరే. నేను సీఎం అయిన తొలినాళ్లలోనే ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల లేకపోవటంపై తక్షణ చర్యలు తీసుకున్నాం. ప్రతీ కిలోమీటరుకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతీ మండలానికి ఓ జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజిని ఏర్పాటు చేశాం.' అని చంద్రబాబు అన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు చేయని 2019-24 మధ్య ఉన్న పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారన్నారు. ఇప్పటి వరకూ 14 డీఎస్సీలు జరిగితే, టీడీపీ, ఎన్డీయే హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని తెలిపారు. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. పాఠశాలలకు విద్యార్థుల హాజరు పెంచాలనే లక్ష్యంతో గతంలో డ్రై రేషన్ కూడా అందించామన్నారు.
గత పాలకులు 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ నియామకాన్ని కూడా చేపట్టలేదని చంద్రబాబు విమర్శించారు. మేం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టామన్నారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామని, 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేశామని వెల్లడించారు.
{{/usCountry}}గత పాలకులు 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ నియామకాన్ని కూడా చేపట్టలేదని చంద్రబాబు విమర్శించారు. మేం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టామన్నారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామని, 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేశామని వెల్లడించారు.
{{/usCountry}}'పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేశాం. జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించాం. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల్నే అమలు చేశాం. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే రిజల్ట్స్ ఇచ్చాం. ఎంపిక ప్రక్రియ అంతా ఆన్ లైన్‌లోనే ఉంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది.? ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఎఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్‌లో నియామక ప్రక్రియలో ఒక్క డీవియేషన్ కూడా లేదు.' అని చంద్రబాబు అన్నారు.
తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ, కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ కుట్రలూ పనిచేయవని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నానన్నారు. పూర్తి పారదర్శకతతో బాధ్యతతో, పూర్తి జవాబు దారీతనంతో నియామకాలు జరిగాయని మరోసారి స్పష్టం చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తులు శాసనసభకు వచ్చి డిమాండ్ చేయాలని, రెండున్నర ఏళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం నా జీవితంలో ఇదే తొలిసారని చంద్రబాబు అన్నారు.