హైదరాబాద్ లో ఈగల్ టీం తనిఖీలు - డ్రగ్స్ టెస్ట్ లో ఏపీ MLA కుమారుడికి పాజిటివ్‌..!

హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలో ఈగల్ టీమ్‌ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఏపీకి చెందిన బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్(గంజాయి) తీసుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Published on: Jan 3, 2026, 22:00:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో శనివారం ఈగల్ టీమ్ ప్రత్యేక సోదాలను నిర్వహించింది.కొంతమంది వ్యక్తులు గంజాయి(డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు సమాచారం అందటంతో… ఓ విల్లాను తనిఖీ చేశారు.

హైదరాబాద్ లో ఈగల్ టీం తనిఖీలు - డ్రగ్స్ టెస్ట్ లో ఏపీ ఎమ్మెల్యే కుమారుడికి పాజిటివ్‌..!
హైదరాబాద్ లో ఈగల్ టీం తనిఖీలు - డ్రగ్స్ టెస్ట్ లో ఏపీ ఎమ్మెల్యే కుమారుడికి పాజిటివ్‌..!

ఈగల్ టీమ్ సోదాల్లో అక్కడ ముగ్గురు వ్యక్తులను దొరికారు. అయితే వీరిలో ఏపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి కూడా ఉన్నాడు. అతడు మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు గుర్తించారు. అయితే మిగతా ఇద్దరికి నెగెటివ్ వచ్చింది.

సుధీర్ రెడ్డి గంజాయి వినియోగదారుడిగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. "అతను వినియోగదారుడు కాబట్టి.. మేము అతని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తాము" అని సదరు అధికారి చెప్పారు.

ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ఎమ్మెల్యే కుమారుడి వ్యవహారాన్ని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More