అమెరికా వీసా రిజెక్ట్ అయిందని హైదరాబాద్‌లో ఆంధ్రాకు చెందిన డాక్టర్ సూసైడ్!
అమెరికా వీసా తిరస్కరణకు గురైందని హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల వైద్యురాలు హైదరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆమె అమెరికా వీసా దరఖాస్తు తిరస్కరించిన తర్వాత నిరాశతో ఇలా చేసిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుంటూరుకు చెందిన రోహిణి.. హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌లో ఒంటరిగా నివసిస్తోంది. శనివారం ఉదయం రోహిణి తలుపు తెరవకపోవడంతో ఆమె ఇంటి పనిమనిషి చాలాసేపు కాలింగ్ బెల్ కొట్టింది. అయినా ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారు పదే పదే ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హైదరబాద్ వచ్చి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. రోహిణి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించారు. ఆమె నిరాశతో బాధపడుతున్నట్లు, అమెరికా వీసా దరఖాస్తు తిరస్కరణ గురించి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టుగా అధికారులు తెలిపారు.
రోహిణి తల్లి లక్ష్మి మాట్లాడుతూ, తన కుమార్తె ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటుందని, తన వీసా ఆమోదం కోసం ఎదురుచూస్తోందని తెలిపారు. వీసా రిజెక్ట్ అయ్యేసరికి తట్టుకోలేకపోయిందన్నారు. 'రోహిణి తెలివైనది. 2005 నుంచి 2010 మధ్య కిర్గిజ్స్తాన్‌లో తన ఎంబీబీఎస్ పూర్తి చేసింది. భవిష్యత్తు కోసం కలలు కన్నది.' అని లక్ష్మి చెప్పారు.
రోహిణి ఇంటర్నల్ మెడిసిన్‌లో స్పెషలైజ్ చేయాలనుకుంటుందని, సమీపంలో లైబ్రరీలు ఉన్నందున పద్మారావు నగర్‌లో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమార్తెను భారతదేశంలో వైద్య వృత్తిని కొనసాగించమని కోరానని తల్లి లక్ష్మి చెప్పింది. కానీ అమెరికాలో ఎక్కువ ఆదాయం, రోజుకు తక్కువ మంది రోగులు ఉంటారని రోహిణి చెప్పేదని తెలిపింది. అమెరికా వీసా తిరస్కరణతో రోహిణికి నిరాశ ఎక్కువైందని, మానసికంగా ఇబ్బంది పడిందని తల్లి వెల్లడించింది. కెరీర్ కోసం రోహిణి పెళ్లి చేసుకోలేదని తెలిపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


