వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల కింద కాలువ గట్లకు ఎక్కడ గండి పడుతుందోనన్న ఆందోళన రైతులను, అధికారులను వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి విపత్తులకు ముందస్తుగానే అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది.

కాలువ గట్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, గండ్లు పడకుండా నివారించే 'ప్రాజెక్ట్ గట్టు' (Project GATTU) అమలు కోసం ఏపీ ప్రభుత్వం సోమవారం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ మేరకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు (జీవో) జారీ చేశారు. రాష్ట్ర విపత్తు నివారణ నిధి (SDMF) కింద ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ. 104.87 లక్షలు (రూ. 1 కోటికి పైగా) కేటాయించారు.
ఏంటి 'ప్రాజెక్ట్ గట్టు'? ఎలా పనిచేస్తుంది?
'ప్రాజెక్ట్ గట్టు' అంటే జియోస్పేషియల్ ఆటోమేటెడ్ థ్రెట్ అండ్ టెర్రైన్ యుటిలిటీ (Geospatial Automated Threat and Terrain Utility). పేరుకు తగ్గట్టే ఇది కాలువ కట్టల భద్రతను పర్యవేక్షించే ఒక ముందస్తు హెచ్చరికల వ్యవస్థ (ప్రిడిక్టివ్ కెనాల్ ఎంబాంక్‌మెంట్ కండిషన్ అసెస్‌మెంట్ సిస్టమ్). ఈ వ్యవస్థలో శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, కృత్రిమ మేధ (AI), డ్రోన్ టెక్నాలజీ, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS) తో పాటు రియల్ టైమ్ వర్షపాతం సమాచారాన్ని అనుసంధానిస్తారు.
వీటి సాయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి కాలువల గట్లలో ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎక్కడ కోతకు గురయ్యే ప్రమాదం ఉంది అనే విషయాలను అధికారులు ముందుగానే గుర్తించగలుగుతారు. తద్వారా ప్రమాదం జరగకముందే అప్రమత్తమై, సకాలంలో మరమ్మతులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది.
{{/usCountry}}వీటి సాయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి కాలువల గట్లలో ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎక్కడ కోతకు గురయ్యే ప్రమాదం ఉంది అనే విషయాలను అధికారులు ముందుగానే గుర్తించగలుగుతారు. తద్వారా ప్రమాదం జరగకముందే అప్రమత్తమై, సకాలంలో మరమ్మతులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది.
{{/usCountry}}"ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో కాలువ గట్ల స్థితిగతులను ముందుగానే అంచనా వేసే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 'ప్రాజెక్ట్ గట్టు' అమలుకు రాష్ట్ర విపత్తు నివారణ నిధి కింద రూ. 104.87 లక్షల పరిపాలనా అనుమతులను ప్రభుత్వం మంజూరు చేస్తోంది" అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదల సమయంలో కాలువ గట్లు తెగిపోవడం వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే లోతట్టు గ్రామాలు జలమయమై ప్రాణ నష్టం, రహదారులు, వంతెనలు వంటి ప్రజా మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ వ్యవస్థ ద్వారా కాలువలకు గండ్లు పడే ముప్పును, వరద ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.