రాజమండ్రి కల్తీ పాల ఘటన - 13కు చేరిన మృతుల సంఖ్య
రాజమండ్రి పాల కల్తీ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు.
రాజమండ్రి (లాలాచెరువు ప్రాంతం) కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా చనిపోయిన వారితో కలిపి మృతు సంఖ్య 13కి చేరింది. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరంతా కూడా ఫిబ్రవరి 22 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు అనే వ్యక్తి నిర్వహించే 'వరలక్ష్మి మిల్క్ సెంటర్' నుండి పాలు కొనుగోలు చేసిన దాదాపు 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పాలలో అత్యంత విషపూరితమైన 'ఇథిలీన్ గ్లైకాల్' (Ethylene Glycol) కలవడం వల్ల బాధితుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు ధృవీకరించాయి. ఫిబ్రవరి 16నే బాధితులు ఆసుపత్రుల్లో చేరినప్పటికీ… ఫిబ్రవరి 22న ఓ వృద్ధురాలు కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందింది. దీంతో ఈ వ్యవహారం బయటికొచ్చింది.
మరో ఏడుగురికి చికిత్స….
ఇదే సమయంలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురిలో అనారోగ్య లక్షణాలు బయటపడ్డాయి. ప్రధానంగా వాంతులు, వీరేచనాలు వంటివి కనిపించడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని కూడా వెంటనే ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందించారు. వీరిలో ఇప్పటి వరకు 13 మంది ప్రాాణాలు కోల్పోగా… మరో ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు పాల కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత శాఖ ( ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) వెల్లడించింది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పంచుకుంది. ఏటవాలుగా పళ్లాన్ని ఉంచి పాల చుక్కను వదిలినప్పుడు.. స్వచ్ఛమైన పాలు కనుక అయితే తెల్లటిధార మాదిరిగా దిగుతుంది. అదే నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండా త్వరగా కిందకి దిగిపోతుందని రాష్ట్ర ఆహార భద్రత శాఖ తెలిపింది. ఇలా చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా కల్తీ పాలు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండవచ్చు అని పేర్కొంది.
ఓ గ్లాసులో 10 ఎంఎల్ పాలు, 10 ఎంఎల్ నీటిని కలిపి, బాగా కదలించాలి. అప్పుడు పై భాగంలో మందమైన నురుగు ఏర్పడుతుంది. అదే స్వచ్ఛమైన పాలు అయినట్లయితే నురుగ రాదు. నురుగ వస్తే మాత్రం కల్తీ జరిగినట్లు గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు. కల్తీ ఘటనల గురించి తెలిస్తే 1800425 3857(టోల్-ఫ్రీ నెంబరు), 08645297245 (ఐపీఎం ప్రధాన కార్యాలయం)కు తెలియజేయాలని చెబుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

