పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ధర్మవరంలో అరెస్ట్ చేయబడిన వ్యక్తి కేసులో దర్యాప్తు ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నిందితులను ఉత్తర ప్రదేశ్ కు చెందిన సజ్జాద్ హుస్సేన్, మహారాష్ట్రలోని మాలేగావ్ కు చెందిన తౌఫీక్ ఆలం షేక్ లను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడించారు.

"నూర్ మహ్మద్ అరెస్టు తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. మా బృందాలు ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా, మహారాష్ట్రలోని మాలేగావ్ లో విచారణ కొనసాగించాయి. పాకిస్తాన్ ఆధారిత జిహాదీ వాట్సాప్ గ్రూప్ లతో పాటు జైషే మహ్మద్ తో సంబంధం ఉన్న ఛానెల్స్ లో చురుకుగా ఉన్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశాయి" జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ వివరించారు.
పాకిస్థాన్ ఐఎస్ఐ ఆధారిత జైష్-ఎ-మహమ్మద్‌తో సంబంధం ఉన్న వాట్సాప్ గ్రూపులతో ప్రమేయం ఉందన్న ఆరోపణపై శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన నూర్ మహ్మద్ను గతంలో ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇతని నుంచి సేకరిస్తున్న సమాచారం ఆధారంగా కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా అరెస్ట్ కాబడ్డిన నిందితులిద్దరి నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, జిహాదీ ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని హుస్సేన్ నివాసం నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులిద్దరినీ ఆయా రాష్ట్రాల్లోని కోర్టుల్లో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం ట్రాన్సిట్ వారెంట్లపై ధర్మవరానికి తీసుకువచ్చామని వివరించారు.
“హుస్సేన్ పాకిస్థాన్‌లో ఉన్న టెర్రరిస్ట్ సంస్థలతో పాటు వీడియో కాల్లో మాట్లాడినట్టు ఆధారాలు దొరికాయి. ఇక్కడి యువతను ట్రాప్ చేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ఐఎస్ఐ ఆధారిత ప్రేరేపిత సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి యువత చాలా జాగ్రత్తగా ఉండాలి” అని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు.
{{/usCountry}}“హుస్సేన్ పాకిస్థాన్‌లో ఉన్న టెర్రరిస్ట్ సంస్థలతో పాటు వీడియో కాల్లో మాట్లాడినట్టు ఆధారాలు దొరికాయి. ఇక్కడి యువతను ట్రాప్ చేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ఐఎస్ఐ ఆధారిత ప్రేరేపిత సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి యువత చాలా జాగ్రత్తగా ఉండాలి” అని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు.
{{/usCountry}}