Andhra student suicide in US : కన్నవారి కష్టాలను తీర్చాలని…. అమెరికాలో ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలని ఆ యువకుడు ఎన్నో కలలు కన్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ కలలన్నీ చిధ్రమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఇరగనబోయిన చందు (26) అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా, ప్రవాస భారతీయుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉద్యోగం దొరకకపోవడం, పెరుగుతున్న ఆర్థిక భారమే ఆత్మహత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది.

ఇరగనబోయిన చందు… చికాగోలోని డిపాల్ యూనివర్సిటీ (DePaul University) నుంచి ఇటీవలే తన మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించి, తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన ఎంతో ప్రయత్నించాడు. గత కొన్ని వారాలుగా అమెరికాలోని పలు కంపెనీల్లో ఉద్యోగాల కోసం తీవ్రంగా వెతికినా ఫలితం లేకపోయింది. మరోవైపు, అమెరికాలో జీవన వ్యయం పెరగడం… మరోవైపు ఆర్థిక ఇబ్బందులు పెరగటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకుపైనే ఆశలన్నీ..
చందు కుటుంబ నేపథ్యం అత్యంత దయనీయంగా ఉంది. కర్నూలు జిల్లాలో ఆయన తండ్రి ఒక సాధారణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన తండ్రి అంత కష్టపడి సంపాదిస్తున్నా, తాను మాత్రం ఇంకా వారిపైనే ఆధారపడటం చందును మానసికంగా కృంగదీసింది. ఆశించిన ఫలితం రాకపోవడం, ఇంటి వద్ద తండ్రి పడుతున్న కష్టం, పెరుగుతున్న అప్పులు అతడిని కలచివేశాయి. తన వల్ల కుటుంబానికి భారం పెరుగుతోందన్న ఆవేదనతోనే చందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ విషాద ఘటనపై అమెరికాలోని తెలుగు సంఘాలు స్పందించాయి. చందు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు తానా (TANA) కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై స్పందించారు.
"ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. మృతదేహాన్ని క్షేమంగా, వేగంగా భారత్‌కు తరలించేలా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం" అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతో పాటు ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
{{/usCountry}}"ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. మృతదేహాన్ని క్షేమంగా, వేగంగా భారత్‌కు తరలించేలా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం" అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతో పాటు ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
{{/usCountry}}చందు మరణంపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తెలుగు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగ వేటలో ఉన్న విద్యార్థులు… ధైర్యంగా ఉండాలని, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోరాలని నిపుణులు సూచిస్తున్నారు.