Andhra University Centenary Celebrations : విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఆంధ్రా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ నగరం వేదికగా జరిగిన ఈ ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడా దిగ్గజాలు తరలివచ్చారు.

ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ కె. హరిబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలకు మరింత శోభను చేకూర్చారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభం….
ఈ శతాబ్ది ఉత్సవాలు సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అనంతరం జాతీయ గీతం మరియు వందేమాతర గీతాలతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వందేళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను, విద్యారంగంలో అది పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనకు శతాబ్ది స్మారక చిహ్నాన్ని (బహూకరించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసి గౌరవించారు.
విశాఖలో విద్యార్థుల కేరింతలు, ప్రముఖుల సందడితో ఆంధ్రా విశ్వవిద్యాలయ ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది. రాబోయే తరాలకు కూడా ఈ విశ్వవిద్యాలయం జ్ఞాన వెలుగులు పంచాలని వక్తలు ఆకాంక్షించారు.
ఆంధ్రా యూనివర్శిటీని మరింత అభివృద్ధి చేస్తామని సీం చంద్రబాబు ప్రకటించారు. క్యాంపస్ అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా రూ. 500 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. భారతదేశంలోనే ఏయూ ఒక్క పెద్ద బ్రాండ్ గా మారబోతుందన్నారు. ఏయూ వందేళ్ల వేడుకలో మాట్లాడటం తన అదృష్టమనిచెప్పుకొచ్చారు.
ఆంధ్రా యూనివర్శిటీ ఒక ఎమోషన్ - మంత్రి లోకేశ్
{{/usCountry}}ఆంధ్రా యూనివర్శిటీని మరింత అభివృద్ధి చేస్తామని సీం చంద్రబాబు ప్రకటించారు. క్యాంపస్ అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా రూ. 500 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. భారతదేశంలోనే ఏయూ ఒక్క పెద్ద బ్రాండ్ గా మారబోతుందన్నారు. ఏయూ వందేళ్ల వేడుకలో మాట్లాడటం తన అదృష్టమనిచెప్పుకొచ్చారు.
ఆంధ్రా యూనివర్శిటీ ఒక ఎమోషన్ - మంత్రి లోకేశ్
{{/usCountry}}ఆంధ్రా యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ మాత్రమే కాదని… ఇది ఒక ఎమోషన్ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. “2014లో రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి రెండు బ్రాండ్లు వచ్చాయి. ఒకటి ఆంధ్రా యూనివర్సిటీ.. మరొకటి సీబీఎన్. 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తొలి కేబినెట్ భేటీ ఏయూలోనే నిర్వహించాం.పక్కనే విశాఖ బీచ్ రోడ్డు, ఏయూ విద్యార్థుల జోష్, అద్భుతమైన ఫ్యాకల్టీ.. ఇవన్నీ చూస్తుంటే ఏయూలో చదవనందుకు ఎంతో బాధపడుతున్నా” అంటూ కామెంట్స్ చేశారు.