Andhrapradesh : దసరా వేళ దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ - అనుమతి ఉంటేనే...

దుర్గాపూజ నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు.

Published on: Oct 8, 2026, 19:11:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

నవరాత్రి ఉత్సవాలకు సమాయత్తమవుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని దుర్గాదేవి భక్తులు, పూజా నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా పండుగ ఉత్సవాలను ప్రజలంతా ఎంతో భక్తిశ్రద్ధలు, సంతోషాల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. 2026 దసరా నవరాత్రుల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్
దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్

ఈ నిర్ణయం ప్రకారం…. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఉండే మండపాలకు నిర్ణీత పరిమితి మేర విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రతి అధికారిక దుర్గాదేవి మండపానికి 3 కిలోవాట్ల (3 KW) వరకు ఉచిత విద్యుత్ సరఫరా అందుతుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లోఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల (5 KW) వరకు ఉచిత విద్యుత్‌ను సఫరా చేస్తారు.

పోలీసుల అనుమతి ఉంటేనే….

పండుగ వేళ భక్తులంతా ఒక్కటై దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించుకునేలా ప్రోత్సహించేందుకే ఈ ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా గ్రామాలు, నగరాల్లో నిర్వాహకులు ఏర్పాటు చేసే కాంతులీనే లైటింగ్, మైక్ సిస్టమ్స్ మరియు ఇతర విద్యుత్ అవసరాలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది. అయితే తప్పకుండా మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వాటికి మాత్రమే ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొంది.

దసరా ఉత్సవాల నిర్వహణలో ఆర్థిక భార తగ్గింపు దిశగా తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుర్గాపూజా కమిటీ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More