ఈనెల 17 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు - రేపు అంకురార్పణ, వాహన సేవలు ఇలా….
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈనెల 16వ తేదీన అంకురార్పణ చేస్తారు. 17వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకు బ్రహ్మోత్సాలు వైభవంగా జరుగుతాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 16వ తేదీ అంకురార్పణ జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
నవంబరు 17న ధ్వజారోహణం
శ్రీ పద్మావతి ఆలయంలో నవంబరు 17న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహనసేవల వివరాలు :
17-11-2025
- ఉదయం – ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం)
- రాత్రి – చిన్నశేషవాహనం
18-11-2025
- ఉదయం – పెద్దశేషవాహనం
- రాత్రి – హంసవాహనం
19-11-2025
- ఉదయం – ముత్యపుపందిరి వాహనం
- రాత్రి – సింహవాహనం
20 -11-2025
- ఉదయం – కల్పవృక్ష వాహనం
- రాత్రి – హనుమంత వాహనం
21 -11-2025
- ఉదయం – పల్లకీ ఉత్సవం
- రాత్రి – గజవాహనం
22-11-2025
- ఉదయం – సర్వభూపాలవాహనం
- సమయం – స్వర్ణరథం,
- రాత్రి – గరుడవాహనం
23-11-2025
- ఉదయం – సూర్యప్రభ వాహనం
- రాత్రి – చంద్రప్రభ వాహనం
24-11-2025
- ఉదయం – రథోత్సవం
- రాత్రి – అశ్వ వాహనం
25-11-2025
- ఉదయం – పంచమీతీర్థం
- రాత్రి – ధ్వజావరోహణం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

