రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల అయ్యాయి. సీఎం చంద్రబాబు రిలీజ్ చేశారు.
వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్లిలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ యోజన రెండో విడత నిధులను విడుదల చేశారు. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3200 కోట్ల నిధులను విడుదల అయ్యాయి. రూ.7వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రూ..5వేలు కాగా.. కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు రూ.2 వేలు ఉన్నాయి.

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చాయో రాలేదో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతు ఆధార్ నెంబర్‌తో స్టేటస్ చెక్ చేయవచ్చు. దీని ద్వారా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
annadathasukhibhava.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
హోమ్‌పేజీలోని “Know Your Status” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే ఉన్న క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి.
సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అందిన మొత్తం, తేదీ, ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
సక్సెస్ అంటే డబ్బు జమ అయిందని అర్థం. Pending/Rejected అంటే ఇంకా జమ కాలేదు, నిరాకరించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీ గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి. ఏపీలో రైతుగా నమోదు అయినవారు, ఆధార్, బ్యాంక్ వివరాలు కలిగినవారు, పంట నమోదు చేసుకున్న రైతులు అర్హులు. దీనితోపాటుగా పీఎం కిసాన్ పథకానికి నమోదు అయి ఉండాలి.
ఆర్థిక ఇబ్బందులున్నా
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని చంద్రబాబు అన్నారు. హామీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారని, సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామన్నారు. ఇప్పటిదాకా 46.85 లక్షల మంది రైతులకు రూ.14 వేల చొప్పున జమ చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు.
పంచ సూత్రాలు
రైతుల అభివృద్ధి కోసం పంచ సూత్రాలను తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. సాగు తీరు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, ప్రకృతి సేద్యంలో ఎవరు ముందు ఉంటే వారిదే భవిష్యత్తు, రైతుల బతుకులు మారాలి.. అని పంచసూత్రాలు తీసుకొచ్చామన్నారు. వాటిని అమలు చేస్తే రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుందన్నారు. రైతులు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.
నదుల అనుసంధానం
రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా చేయాలని, ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది తన సంకల్పమని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరితోపాటుగా అనేక నదులు ఉన్నాయని, నదుల అనుసంధానం ద్వారా రిజర్వాయర్లలో నీరు నింపితే.. ఏడాది వర్షం పడకపోయినా ఇబ్బంది ఉండదన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


