...
...
Next Story

ఏపీకి మరో తుపాను హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనితో రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి.

Published on: Nov 20, 2025, 09:46:51 IST
Advertisement

ఏపీకీ మరో తుపాను ముప్పు ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని, వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో ఏపీలో వర్షాలు పడనున్నాయి.

ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. దీనితో ఇవాళ.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రోజున కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతోపాటుగా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లోనూ వానలు పడనున్నాయి.

ఈ వాతావరణ ప్రభావంతో నంబర్ 22 నుంచి 25 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కోస్తా జగిల్లాల్లో గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపైనా ప్రభావం చూపించనుంది. ఇలాంటి వాతావరణంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరించింది.

ఏపీలో చలి విపరీతంగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో మంగళవారం రాత్రి 4.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ముంచంగిపుట్టు-5.8, చింతపల్లి-6.8, డుంబ్రిగుడ-7.8, పాడేరు-8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఇంకా డిసెంబర్ రాకముందే ఏజెన్సీలో చలి దారుణంగా ఉంది. డిసెంబర్, జనవరిలో ఎలా ఉంటుందోననే భయం నెలకొంది.

తుపాను ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పొడి వాతావరణం కొనసాగనుంది. అయితే పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ.. రాత్రిపూట మాత్రం ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత మరింత పెరగనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks