ఆంధ్రప్రదేశ్ : హోంగార్డు ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ. కోట్లలో అక్రమాస్తులు...!

విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోటలో హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది.  శ్రీనివాసరావు సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా పనిచేస్తున్నారు. రూ. 20 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం.

Published on: Jan 29, 2026, 16:49:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అతనో హోంగార్డు.. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నాడు. కానీ ఆయన ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నాయి. ఏకంగా ఏసీబీ… అతని అక్రమాస్తులపై ఫోకస్ పెట్టే అంత వరకు విషయం వెళ్లింది. దీంతో ఏకకాలంలో ఆయన నివాసంతో పాటు మరో రెండో చోట్ల సోదాలు చేపట్టడంతో…. భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.

హోంగార్డు నివాసంలో ఏసీబీ సోదాలు
హోంగార్డు నివాసంలో ఏసీబీ సోదాలు

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు ఎన్ శ్రీనివాసరావు భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీకి సమాచారం అందింది. దీంతో శ్రీనివాసరావుకు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాకంలో సోదాలు చేపట్టారు. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.

భారీగా ఆస్తులు…!

ఆయనకు సంబంధించిన రికార్డులు, దస్త్రాలను పరిశీలించగా… శ్రీనివాసరావు ఏకంగా రూ.20 కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. సాధారణ హోంగార్డు ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించారన్నది చర్చనీయాంశంగా మారింది.

శ్రీనివాసరావు ఏసీబీలో కూడా కొన్నేళ్లు పని చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే…. ఏసీబీ రైడ్స్‌పై కొందరికి ముందుగానే సమాచారం ఇచ్చి క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏడాది క్రితమే ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఏసీబీ అధికారులు… ఏకకాలంలో పలుచోట్ల సోదాలు చేయడంతో శ్రీనివాసరావు అక్రమార్జన చిట్టా బయటపడినట్లు అయింది. శ్రీనివాసరావు అక్రమాస్తుల వ్యవహారంపై మరింత లోతుగా ఏసీబీ అధికారుల బృందం విచారణ జరిపే అవకాశం ఉంది. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More