...
...
Next Story

AP Govt Nandi Awards : త్వరలోనే నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రదానం

‘అమరావతి ఆవకాయ్’ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దుర్గేశ్… త్వరలోనే నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రదానం ఉంటుందని ప్రటించారు.

Published on: Jan 11, 2026, 12:44:57 IST
Advertisement

తెలుగు వారి సంస్కృతికి, రుచులకు మరియు కళలకు ప్రతిబింబంగా నిలిచిన ‘అమరావతి ఆవకాయ్’ ఉత్సవాలు శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ముగింపు వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

అట్టహాసంగా ముగిసిన ‘అమరావతి ఆవకాయ్’ వేడుకలు
అట్టహాసంగా ముగిసిన ‘అమరావతి ఆవకాయ్’ వేడుకలు

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ…అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు.

నంది అవార్డుల పునరుద్ధరణ…

గత ప్రభుత్వ హయాంలో కళలు, సంస్కృతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ కందుకూరి, ఉగాది పురస్కారాలను అందజేశామని గుర్తుచేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నంది నాటకోత్సవాలు నిర్వహించి, ప్రతిభావంతులకు నంది అవార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల కోనసీమలోని జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ ఉదహరించారు. రాష్ట్రంలో లబ్ద ప్రతిష్టులైన స్వాతంత్ర్య సమరయోధులు, కవులు తదితరుల జయంతులు, వర్థంతులు జరుపుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నామని గుర్తుచేశారు.

అమరావతిని ప్రజారాజధానిగా, ఆవకాయను ఆంధ్రుల ప్రత్యేక రుచిగా అభివర్ణిస్తూ.. జీవితంలోని నవరసాల కలయికే ఈ ఫెస్టివల్ అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పర్యాటక శాఖ అధికారులకు, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులకు మరియు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks