ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నవంబర్ 2వ తేదీ వరకు సర్టిఫికెట్లు అప్ లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 2వ తేదీ వరకు అభ్యర్థులు…. వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
నవంబర్ 4న సీట్ల కేటాయింపు…

ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకారం.... నవంబర్ 3వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఇక నవంబర్ 4వ తేదీన సీట్లను కేటాయిస్తారు. ఈ థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు నవంబరు 7లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
అలాట్ మెంట్ డౌన్లోడ్ ప్రాసెస్….
- విద్యార్థులు https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- మీ ఈమెయిన్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ కావాలి.
- ఆ తర్వాత మీకు ఏ కాలేజీలో సీటు కేటాయించారనేది డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా… రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. థర్డ్ ఫేజ్ కూడా పూర్తి అయిన తర్వాత…. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక్రియను పూర్తి చేస్తారు.