ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం - ఈనెల 4న సీట్ల కేటాయింపు

ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మూడో విడత రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా... తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 4వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

Published on: Nov 1, 2025, 12:09:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నవంబర్ 2వ తేదీ వరకు సర్టిఫికెట్లు అప్ లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 2వ తేదీ వరకు అభ్యర్థులు…. వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

ఏపీ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ 2025
ఏపీ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ 2025

నవంబర్ 4న సీట్ల కేటాయింపు…

ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకారం.... నవంబర్ 3వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఇక నవంబర్ 4వ తేదీన సీట్లను కేటాయిస్తారు. ఈ థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు నవంబరు 7లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

అలాట్ మెంట్ డౌన్లోడ్ ప్రాసెస్….

  1. విద్యార్థులు https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. మీ ఈమెయిన్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ కావాలి.
  3. ఆ తర్వాత మీకు ఏ కాలేజీలో సీటు కేటాయించారనేది డిస్ ప్లే అవుతుంది.
  4. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.

ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా… రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. థర్డ్ ఫేజ్ కూడా పూర్తి అయిన తర్వాత…. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక్రియను పూర్తి చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More