రాష్ట్రంలోని బడులకు కొత్త టీచర్లకు రానున్నారు. ఇప్పటికే డీఎస్సీ ప్రక్రియ ముగియగా… ప్రస్తుతం ఎంపికైన వారి శిక్షణ కొనసాగుతోంది. ఈనెల 10వ తేదీతో ఇది ముగుస్తుంది. అయితే పోస్టింగుల కోసం ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.
ఈనెల 11న పాఠశాలల కేటాయింపు…
ఇవాళ, రేపు కొత్త టీచర్లు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. వీటిని పరిశీలించిన తర్వాత… ఈనెల 11వ తేదీన వారు పని చేయాల్సిన పాఠశాల వివరాలను తెలుపుతారు. అంటే అలాట్ మెంట్ అర్డర్ వచ్చేస్తోంది. ఇక అకడమిక్ కేలండర్, హ్యాండ్‌బుక్ తదితర మెటీరియల్ అందిస్తారు.ఆ తర్వాత కొత్త టీచర్లు స్థానిక పాఠశాలల పరిధిలో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇక ఈనెల 13వ తేదీ నుంచే కొత్త టీచర్లు బడుల్లో చేరాల్సి ఉంటుంది.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న జారీ అయింది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహించారు. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశారు. తుది ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ ఇటీవలే విడుదల చేసింది.
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న జారీ అయిన సంగతి తెలిసిందే. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహించారు. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశారు. తుది ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
మొత్తం 16,347 పోస్టులకు.. 15,941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇక ప్రతి ఏటా డీఎస్సీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే మరో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
అక్టోబర్ 25 వరకు ఛాన్స్…!
{{/usCountry}}మొత్తం 16,347 పోస్టులకు.. 15,941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇక ప్రతి ఏటా డీఎస్సీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే మరో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
అక్టోబర్ 25 వరకు ఛాన్స్…!
{{/usCountry}}మరోవైపు మెగా డీఎస్సీ తుది జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అక్టోబర్ 25వరకు తెలపవచ్చు. దీనికోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ, ఇద్దరు డీఈవోలతో జోనల్ కమిటీ, రాష్ట్రస్థాయి పోస్టులకు ముగ్గురు రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలను నియమించారు. ఒకవేళ జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకుంటే.. రాష్ట్రస్థాయి కమిటీకి వెళ్లవచ్చు.
రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే.. తుది అప్పీలేట్ అథారిటీ అంటే పాఠశాల విద్య డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కమిటీలు 15 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తుందని విద్యాశాఖ అధికారులు చెప్పారు. తుది అప్పీలేట్ అథారిటీ ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తుంది.