ఏపీ డీఎస్సీ 2025 : పోస్టింగుల కోసం అందుబాటులోకి వెబ్ ఆప్షన్లు - ఈనెల 13న బడులకు కొత్త టీచర్లు..!
ఏపీ డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లు విధుల్లోకి రానున్నారు. ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ రేపటి నాటికి పూర్తి కాగానే…అలాట్ మెంట్ పత్రాలను ఇస్తారు. అయితే వీరంతా ఈనెల 13వ తేదీన బడుల్లో చేరాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని బడులకు కొత్త టీచర్లకు రానున్నారు. ఇప్పటికే డీఎస్సీ ప్రక్రియ ముగియగా… ప్రస్తుతం ఎంపికైన వారి శిక్షణ కొనసాగుతోంది. ఈనెల 10వ తేదీతో ఇది ముగుస్తుంది. అయితే పోస్టింగుల కోసం ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.
ఈనెల 11న పాఠశాలల కేటాయింపు…
ఇవాళ, రేపు కొత్త టీచర్లు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. వీటిని పరిశీలించిన తర్వాత… ఈనెల 11వ తేదీన వారు పని చేయాల్సిన పాఠశాల వివరాలను తెలుపుతారు. అంటే అలాట్ మెంట్ అర్డర్ వచ్చేస్తోంది. ఇక అకడమిక్ కేలండర్, హ్యాండ్‌బుక్ తదితర మెటీరియల్ అందిస్తారు.ఆ తర్వాత కొత్త టీచర్లు స్థానిక పాఠశాలల పరిధిలో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇక ఈనెల 13వ తేదీ నుంచే కొత్త టీచర్లు బడుల్లో చేరాల్సి ఉంటుంది.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న జారీ అయింది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహించారు. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశారు. తుది ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ ఇటీవలే విడుదల చేసింది.
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న జారీ అయిన సంగతి తెలిసిందే. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహించారు. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశారు. తుది ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
మొత్తం 16,347 పోస్టులకు.. 15,941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇక ప్రతి ఏటా డీఎస్సీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే మరో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
అక్టోబర్ 25 వరకు ఛాన్స్…!
మరోవైపు మెగా డీఎస్సీ తుది జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అక్టోబర్ 25వరకు తెలపవచ్చు. దీనికోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ, ఇద్దరు డీఈవోలతో జోనల్ కమిటీ, రాష్ట్రస్థాయి పోస్టులకు ముగ్గురు రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలను నియమించారు. ఒకవేళ జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకుంటే.. రాష్ట్రస్థాయి కమిటీకి వెళ్లవచ్చు.
రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే.. తుది అప్పీలేట్ అథారిటీ అంటే పాఠశాల విద్య డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కమిటీలు 15 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తుందని విద్యాశాఖ అధికారులు చెప్పారు. తుది అప్పీలేట్ అథారిటీ ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

