AP DSC Notification 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు విద్యాశాఖ తీపి కబురు వచ్చేసింది. రాష్ట్రంలో మరో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. వచ్చే అక్టోబర్ నెలలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసి…. డిసెంబర్ నెలలోనే రాత పరీక్షలు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది.

పాఠశాల విద్యను మరింత మెరుగుపరచడంతో పాటు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాబోయే నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి సమగ్ర వివరాలను అక్టోబర్‌లో విడుదల చేసే షెడ్యూల్‌లో విద్యాశాఖ పొందుపరచనుంది.
డిసెంబర్‌లోనే పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలు త్వరలోనే విద్యాశాఖ అధికారికంగా ప్రకటించనుంది.
కొనసాగుతున్న ఏపీ టెట్ పరీక్షలు :
మరోవైపు ఏపీ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నెల 16వ తేదీతో అన్ని ముగుస్తున్నాయి. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మొదటి షిఫ్ట్ ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతుంది. అలాగే రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 02:30 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు ఉంటుంది.
పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేసి… వచ్చే నెలలో ఫలితాలను ప్రకటిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలును అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in లో చూడొచ్చు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందు టెట్ నిర్వహించడం సర్వసాధారణం. ఈ పరీక్షలో సాధించే మార్కులకు డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో కీలకమైన వెయిటేజీ ఉంటుంది.
{{/usCountry}}రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందు టెట్ నిర్వహించడం సర్వసాధారణం. ఈ పరీక్షలో సాధించే మార్కులకు డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో కీలకమైన వెయిటేజీ ఉంటుంది.
{{/usCountry}}