AP DSC Notification 2026 : డీఎస్సీ నోటిఫికేషన్ పై విద్యాశాఖ కసరత్తు - అక్టోబర్‌లో మరో నోటిఫికేషన్ - డిసెంబర్‌లో పరీక్షల
AP DSC Notification 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన వచ్చేసింది. వచ్చే అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
AP DSC Notification 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు విద్యాశాఖ తీపి కబురు వచ్చేసింది. రాష్ట్రంలో మరో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. వచ్చే అక్టోబర్ నెలలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసి…. డిసెంబర్ నెలలోనే రాత పరీక్షలు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది.

పాఠశాల విద్యను మరింత మెరుగుపరచడంతో పాటు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాబోయే నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి సమగ్ర వివరాలను అక్టోబర్‌లో విడుదల చేసే షెడ్యూల్‌లో విద్యాశాఖ పొందుపరచనుంది.
డిసెంబర్‌లోనే పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలు త్వరలోనే విద్యాశాఖ అధికారికంగా ప్రకటించనుంది.
కొనసాగుతున్న ఏపీ టెట్ పరీక్షలు :
మరోవైపు ఏపీ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నెల 16వ తేదీతో అన్ని ముగుస్తున్నాయి. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మొదటి షిఫ్ట్ ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతుంది. అలాగే రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 02:30 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు ఉంటుంది.
పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేసి… వచ్చే నెలలో ఫలితాలను ప్రకటిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలును అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in లో చూడొచ్చు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందు టెట్ నిర్వహించడం సర్వసాధారణం. ఈ పరీక్షలో సాధించే మార్కులకు డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో కీలకమైన వెయిటేజీ ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

