AP EAPCET 2026 Counseling : ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలు

AP EAPCET BiPC Stream Counseling : ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Aug 7, 2026, 14:15:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET BiPC Stream Counseling : ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ (EAPCET) బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఫార్మసీ, బయోటెక్నాలజీ, సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తమ సీట్లను ఖరారు చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్ (BiPC) స్ట్రీమ్ కౌన్సెలింగ్
ఏపీ ఈఏపీసెట్ (BiPC) స్ట్రీమ్ కౌన్సెలింగ్

కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు

  • రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
  • ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నియమిత సహాయ కేంద్రాల వద్ద • ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన ఉంటుంది.
  • ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థులు కోర్సులు, కళాశాలలను వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
  • నమోదు చేసిన ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 20న అవకాశం ఉంటుంది.
  • అభ్యర్థుల మెరిట్, కేటగిరీ ఆధారంగా ఈ నెల 23న సీట్లను కేటాయిస్తారు.

సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి చేరాల్సి ఉంటుంది. మరోవైపు…. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ నెల 24 నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్దేశిత గడువు లోగా ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈసారి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 63,546 మంది అర్హత సాధించారు (89.59 శాతం). వీరంతా కూడా కౌన్సెలింగ్ లో పాల్గొంటారు.

ఏపీ ఈఏపీసెట్ 2026లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు చేస్తారు. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయ పూర్తవుతుంది. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.

AP EAPCET 2026 ఫలితాలను ఎలా చూసుకోవాలి?

  1. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More