AP EAPCET 2026 Counselling : ఏపీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల - ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య సమాచారం

AP EAPCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET 2026)  ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జులై 20 నుంచి కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Jul 15, 2026, 20:08:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్ ఎప్‌సెట్ ఫలితాలు (AP EAPCET 2026 Results) వెల్లడి కావడంతో…. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - 2026
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - 2026

ఈనెల 20 నుంచి రిజిస్ట్రేషన్లు…

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన మొదటి దశ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు జులై 29 వరకు ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియ కోసం విద్యాశాఖ అధికారులు మొత్తం పది రోజుల పాటు గడువు ఇచ్చారు.

  • విద్యార్థులు తమ దరఖాస్తులతో పాటు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియ జులై 22 నుంచి ప్రారంభవుతుంది. జులై 31వ తేదీతో గడువు ముగుస్తుంది.
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు జులై 25 నుంచి జులై 31వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
  • ఒకవేళ తాము ఎంచుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, అందుకు ఆగస్టు 1వ తేదీ వరకు ఛాన్స్ ఉంటుంది.

ఆగస్టు 6న సీట్ల కేటాయింపు..

వెబ్ ఆప్షన్ల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 6వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 13వ తేదీ లోపు కేటాయించిన కాలేజీల్లో స్వయంగా హాజరై సెల్ఫ్ జాయినింగ్, రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.

సీటు పొందే విద్యార్థులు తప్పనిసరిగా రిపోర్టింగ్ చేయాలి. అలా చేయకపోతే… సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇక ఈసారి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షల ఫలితాలను చూస్తే…. ఇంజనీరింగ్‌లో 1,82,317 మంది అర్హత సాధించారు(70.52 శాతం). అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు.ఇంజినీరింగ్‌లో 71.65 శాతం ఉత్తీర్ణత శాతంతో అమ్మాయిలు ముందంజలో నిలిచారు.

AP EAPCET - 2026 ర్యాంక్ ఎలా చూసుకోవాలి?

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

  • అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
  • కౌన్సెలింగ్ తో పాటు అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా ముఖ్యం.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More