AP EAPCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్ ఎప్‌సెట్ -2026 కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ కౌన్సెలింగ్ ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు జులై 29 వరకు ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియ కోసం విద్యాశాఖ మొత్తం పది రోజుల పాటు గడువు ఇచ్చింది.
- విద్యార్థులు తమ దరఖాస్తులతో పాటు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియ జులై 22 నుంచి ప్రారంభవుతుంది. జులై 31వ తేదీతో గడువు ముగుస్తుంది.
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు జులై 25 నుంచి జులై 31వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
- ఒకవేళ తాము ఎంచుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, అందుకు ఆగస్టు 1వ తేదీ వరకు ఛాన్స్ ఉంటుంది.
ఆగస్టు 6న సీట్ల కేటాయింపు..

వెబ్ ఆప్షన్ల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 6వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 13వ తేదీ లోపు కేటాయించిన కాలేజీల్లో స్వయంగా హాజరై సెల్ఫ్ జాయినింగ్, రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
సీటు పొందే విద్యార్థులు తప్పనిసరిగా రిపోర్టింగ్ చేయాలి. అలా చేయకపోతే… సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇక ఈసారి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షల ఫలితాలను చూస్తే…. ఇంజనీరింగ్‌లో 1,82,317 మంది అర్హత సాధించారు(70.52 శాతం). అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు.ఇంజినీరింగ్‌లో 71.65 శాతం ఉత్తీర్ణత శాతంతో అమ్మాయిలు ముందంజలో నిలిచారు.