AP EAPCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 కౌన్సెలింగ్‌కు సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రాసెస్ కొనసాగుతుండగా… సర్టిఫికేట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ గడువును అధికారులు పొడిగించారు.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక వెబ్‌సైట్ https://eapcet-sche.aptonline.in/ లేదా https://cets.apsche.ap.gov.in/ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
సవరించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు…
- అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీని ఆగస్టు 01, 2026 వరకు పొడిగించారు.
- హెల్ప్ లైన్ సెంటర్ల (HLCs) ద్వారా అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్ల ఆన్‌లైన్ పరిశీలన ఆగస్టు 02, 2026 వరకు కొనసాగుతుంది.
- విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు ఆగస్టు 03, 2026 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
- ఆప్షన్లు నమోదు చేసిన అభ్యర్థులు వాటిని మార్చుకునేందుకు (Change of Web Options) ఆగస్టు 04, 2026న ఒక్క రోజు అవకాశం కల్పించారు.
- నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 09, 2026న సాయంత్రం విడుదల చేస్తారు.
- సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి… సంబంధిత కళాశాలల్లో నేరుగా రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15, 2026 వరకు గడువు ఇచ్చారు.
- మొదటి విడత ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఆగస్టు 10, 2026 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఈఏపీసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు, స్టడీ సర్టిఫికెట్లు (ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు), కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. అంతేకాకుండా…… ఆదాయ పరిమితి ధ్రువీకరణ పత్రం లేదా బియ్యం కార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి.
{{/usCountry}}ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఈఏపీసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు, స్టడీ సర్టిఫికెట్లు (ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు), కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. అంతేకాకుండా…… ఆదాయ పరిమితి ధ్రువీకరణ పత్రం లేదా బియ్యం కార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి.
{{/usCountry}}సాంకేతిక లోపాలు లేదా సందేహాలు ఉన్న విద్యార్థులు సమీపంలోని హెల్ప్ లైన్ సెంటర్లను నేరుగా సంప్రదించవచ్చు. అధికారిక పోర్టల్‌లో అందించిన హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందొచ్చు. చివరి నిమిషంలో వెబ్‌సైట్ రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున విద్యార్థులు చివరి తేదీ వరకు ఆగకుండా వెంటనే తమ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.