AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ 2026 అభ్యర్థులకు అలర్ట్ - కౌన్సెలింగ్ గడువు పొడిగింపు, కొత్త తేదీలివే
AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. సవరించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం… ఆగస్ట్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
AP EAPCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 కౌన్సెలింగ్‌కు సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రాసెస్ కొనసాగుతుండగా… సర్టిఫికేట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ గడువును అధికారులు పొడిగించారు.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక వెబ్‌సైట్ https://eapcet-sche.aptonline.in/ లేదా https://cets.apsche.ap.gov.in/ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
సవరించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు…
- అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీని ఆగస్టు 01, 2026 వరకు పొడిగించారు.
- హెల్ప్ లైన్ సెంటర్ల (HLCs) ద్వారా అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్ల ఆన్‌లైన్ పరిశీలన ఆగస్టు 02, 2026 వరకు కొనసాగుతుంది.
- విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు ఆగస్టు 03, 2026 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
- ఆప్షన్లు నమోదు చేసిన అభ్యర్థులు వాటిని మార్చుకునేందుకు (Change of Web Options) ఆగస్టు 04, 2026న ఒక్క రోజు అవకాశం కల్పించారు.
- నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 09, 2026న సాయంత్రం విడుదల చేస్తారు.
- సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి… సంబంధిత కళాశాలల్లో నేరుగా రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15, 2026 వరకు గడువు ఇచ్చారు.
- మొదటి విడత ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఆగస్టు 10, 2026 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఈఏపీసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు, స్టడీ సర్టిఫికెట్లు (ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు), కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. అంతేకాకుండా…… ఆదాయ పరిమితి ధ్రువీకరణ పత్రం లేదా బియ్యం కార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి.
సాంకేతిక లోపాలు లేదా సందేహాలు ఉన్న విద్యార్థులు సమీపంలోని హెల్ప్ లైన్ సెంటర్లను నేరుగా సంప్రదించవచ్చు. అధికారిక పోర్టల్‌లో అందించిన హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందొచ్చు. చివరి నిమిషంలో వెబ్‌సైట్ రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున విద్యార్థులు చివరి తేదీ వరకు ఆగకుండా వెంటనే తమ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

