AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం, ముఖ్య వివరాలు

AP EAPCET 2026 Final Phase Counselling : ఏపీ ఈఏపీసెట్(ఎంపీసీ స్ట్రీమ్) - 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తాజాగా వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Published on: Sep 10, 2026, 15:41:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు వెబ్ ఆప్షన్ల నమోదు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో సీటు సాధించడమే లక్ష్యంగా ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cap.apcfss.in ద్వారా తమ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్  కౌన్సెలింగ్ అప్డేట్
ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్

గతంలో జరిగిన మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీటు లభించని విద్యార్థులకు ఇది ఎంతో కీలకమైన అవకాశం. అంతేకాకుండా, ఇప్పటికే సీటు సాధించినప్పటికీ, అంతకంటే మంచి కళాశాల లేదా నచ్చిన కోర్సు (బ్రాంచ్) కోసం మారాలని భావించే అభ్యర్థులు కూడా ఈ చివరి విడతలో పాల్గొనవచ్చని అధికారులు వెల్లడించారు.

ఈనెల 12 వరకు వెబ్ ఆప్షన్లు…

ఈనెల 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈనెల 13వ తేదీన వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవచ్చు. ఈనెల 16వ తేదీన సీట్లు కేటాయింపు ఉంటుంది. ఈనెల 16 నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు.

  • వెబ్ ఆప్షన్ల నమోదు చివరి తేదీ: సెప్టెంబర్ 12, 2026 వరకు అభ్యర్థులు తమ ప్రాధాన్యత ప్రకారం కళాశాలలు, కోర్సుల ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
  • ఆప్షన్ల సవరణ (Edit Options) : నమోదు చేసుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే సెప్టెంబర్ 13వ తేదీన అవకాశం కల్పిస్తారు.
  • సీట్ల కేటాయింపు : ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 16వ తేదీన తుది సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
  • సెల్ఫ్ రిపోర్టింగ్ - కాలేజీలో చేరిక : సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 19, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి, కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/

ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో నిర్ణీత గడువులోగా చేరాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు నిర్దేశించిన సమయంలోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీ రిపోర్టింగ్ పూర్తి చేయకపోతే…. వారికి కేటాయించిన సీటును ఆటోమేటిక్‌గా రద్దు చేస్తారు. కాబట్టి గత విడతల్లో సీటు రానివారు, లేదా సీటు మారాలనుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాగ్రత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More