AP EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్ - ఏపీ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం, ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోండి

ఏపీ ఈఏపీసెట్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.మార్చి 7వ తేదీతో గడువు ముగుస్తుంది. మే నెలలో పరీక్షలను నిర్వహిస్తారు.

Published on: Feb 5, 2026, 14:22:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ - 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు మార్చి 7వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్ 2026
ఏపీ ఈఏపీసెట్ 2026

ఏపీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ పూర్తి అయిన వారితో పాటు ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా అర్హులవుతారు.ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున జేఎన్‌టీయూ కాకినాడ, నిర్వహిస్తోంది.

ఏపీ ఈఏపీసెట్ 2025 - దరఖాస్తు విధానం

  1. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని ఫీజు పేమెంట్ ఆప్షన్ పై నొక్కి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  3. ఫీజు చెల్లింపు వివరాల ఆధారంగా అప్లికేషన్ ఫారమ్ ను పూర్తి చేయవచ్చు.
  4. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబహర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  5. ఇక్కడ మీ పూర్తి వివరాలతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
  6. చివరగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  7. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మీ రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

AP EAPCET 2026 - ముఖ్యమైన తేదీలు

  • ఎంట్రెన్స్ పరీక్షలు - ఏపీ ఈఏపీసెట్ - 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ - 07-03-2026.
  • రూ. 1000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 12-03-2026.
  • రూ. 2000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ -17-03-2026
  • రూ. 4000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 21-03-2026.
  • రూ. 10,000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 26-03-2026 .
  • అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 26-03-2026 నుంచి 28-03-2026.
  • హాల్ టికెట్ డౌన్లోడ్ - 28-04-2026 .
  • ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష - 12-05-2026 నుంచి 15-05-2026 వరకు, మరియు18-05-2026 తేదీల్లో పూర్తవుతాయి.
  • అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు - 19-05-2026 నుంచి 20-05-2026 .
  • అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదల - 23-05-2026 .
  • అభ్యంతరాల స్వీకరణ - 25-05-2025.
  • ప్రాథమికంగా ఫలితాలు ప్రకటించే తేదీ - 01-06-2026 .
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More