AP ECET Results 2026 : ఏపీ ఈసెట్ ప్రాథమిక కీ విడుదల - మే 7న ఫలితాలు
AP ECET Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2026 ప్రాథమిక కీ అందుబాటులోకి వచ్చింది. మే 7న ఎంట్రెన్స్ ఫలితాలను ప్రకటిస్తారు.
AP ECET Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET 2026) రాసిన అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు…. జేఎన్టీయూ అనంతపురం ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీని (Preliminary Key) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 23న జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్ సైట్లో ఉంచారు.

ప్రాథమిక కీలపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా… ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో వాస్తవం ఉంటే, వాటిని సరిచేసి తుది కీని సిద్ధం చేస్తారు. పాలిటెక్నిక్ విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు ఈ పరీక్ష రాస్తారు.
మే 7న ఫలితాలు…
ఏపీ ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ప్రకారం…. ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు మే 7వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కసరత్తు కొనసాగుతోంది. ఫలితాలతో పాటు అభ్యర్థుల ర్యాంకు కార్డులను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో లాటరల్ ఎంట్రీ ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ ఈసెట్ ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి..?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/ECET సందర్శించాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'AP ECET 2026 Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
- స్క్రీన్‌పై మీ ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. భ
- విష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

