AP Edcet 2026 : ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ - దరఖాస్తులు ప్రారంభం, ముఖ్యమైన తేదీలు
ఏపీ ఎడ్‌సెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 9 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మే 4వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించి ఏపీ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మార్చి 9వ తేదీ వరకు ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు.

ఏపీ ఎడ్ సెట్ పరీక్ష ఆధారంగా 2026- 2027 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది పరీక్షను చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. చిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లాంగ్వేజేస్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్ అభ్యర్థులు ఈ పరీక్ష రాయవచ్చు.
ప్రస్తుతం చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఏపీ ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ/ ఎస్టీలకు రూ.500; బీసీలకు రూ.600గా నిర్ణయించారు. ఓసీలకు రూ.700గా ఉంది. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి.
ఏపీ ఎడ్ సెట్ 2026 ముఖ్యమైన తేదీలు:
- ఎడ్ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ- 09-03-2025.
- రూ.1000 ఫైన్ తో దరఖాస్తుకు చివరి తేదీ - 13-03-2026.
- ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తుకు చివరి తేదీ - 17-03-2026.
- రూ.4000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ - 21-03-2026.
- ఆలస్య రుసుము రూ.10,000తో దరఖాస్తుకు చివరి తేదీ - 25-03-2026.
- అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 26-03-2026.
- హాల్ టిక్కెట్ డౌన్లోడ్ - 20-04-2026.
- ప్రవేశ పరీక్ష తేదీ - 04-05-2026.
- ప్రిలిమినరీ కీ విడుదల: 07-05-2026.
- ఎడ్ సెట్ ఫలితాలు విడుదల: 18-05-2026.
ఏపీ ఎడ్‌సెట్ 2026 - అప్లికేషన్ ప్రాసెస్…
- ముందుగా https://cets.apsche.ap.gov.in/EDCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- హోంపేజీలో కనిపించే స్టెప్ 3(ఫిల్ అప్లికేషన్) పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అవసరం.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగపడుంది.
ఏపీ ఎడ్‌సెట్ 2026 ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది.పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











