AP EdCET 2026 Phase 2 Counselling : బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ - 2026 కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఉన్నత విద్యామండలి… సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.

ఏపీ ఎడ్‌సెట్ -2026 పరీక్షలో అర్హత సాధించిన ర్యాంకర్లు…. అలాగే సంబంధిత విశ్వవిద్యాలయాలు లేదా అనుబంధ కళాశాలలు నిర్దేశించిన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ ఈ రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ సి. కృష్ణ వెల్లడించారు. కన్వీనర్ కోటా కింద సీట్లు పొందేందుకు అభ్యర్థులు తమ నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
రెండో విడత ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 12, 2026 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 14, 2026తో గడువు ముగుస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
వివరణాత్మక నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన మరియు వెబ్ ఆప్షన్ల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in ను సందర్శించాలని అధికారులు సూచించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాని వారు….. లేదా సీటు వచ్చినా కళాశాలలో చేరని వారు ఈ రెండవ విడత కౌన్సెలింగ్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.