AP EdCET 2026 Counselling : ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలు

AP EdCET 2026 Phase 2 Counselling : ఏపీ  ఎడ్‌సెట్-2026 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Nov 11, 2026, 13:43:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP EdCET 2026 Phase 2 Counselling : బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ - 2026 కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఉన్నత విద్యామండలి… సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.

ఏపీ ఎడ్‌సెట్ 2026 కౌన్సెలింగ్ (Image Source Istock)
ఏపీ ఎడ్‌సెట్ 2026 కౌన్సెలింగ్ (Image Source Istock)

ఏపీ ఎడ్‌సెట్ -2026 పరీక్షలో అర్హత సాధించిన ర్యాంకర్లు…. అలాగే సంబంధిత విశ్వవిద్యాలయాలు లేదా అనుబంధ కళాశాలలు నిర్దేశించిన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ ఈ రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ సి. కృష్ణ వెల్లడించారు. కన్వీనర్ కోటా కింద సీట్లు పొందేందుకు అభ్యర్థులు తమ నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

రెండో విడత ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 12, 2026 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 14, 2026తో గడువు ముగుస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

వివరణాత్మక నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన మరియు వెబ్ ఆప్షన్ల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in ను సందర్శించాలని అధికారులు సూచించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాని వారు….. లేదా సీటు వచ్చినా కళాశాలలో చేరని వారు ఈ రెండవ విడత కౌన్సెలింగ్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More