APTWREIS : ఏపీ ఏకలవ్య మోడల్ గురుకులాల్లో అడ్మిషన్లు - నోటిఫికేషన్ ముఖ్య వివరాలు

ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని  ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. 

Published on: Jan 31, 2026, 13:54:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 28 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్‌ 4వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 29వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు.

ముఖ్య వివరాలు:

  • అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకటన - గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • అడ్మిషన్ తరగతి - ఆరో తరగతిలో ప్రవేశాలకు
  • 28 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలోని ఆరో తరతగతిలో 60 సీట్లను భర్తీ చేస్తారు. మొత్తం 1,680 (840 బాలురు, 840 బాలికలు) సీట్లు ఉన్నాయి.
  • అర్హతలు - ఐదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.
  • విద్యార్థి వయసు 10 నుంచి 13 ఏళ్ల లోపు ఉండాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - 5 ఫిబ్రవరి 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ -28 ఫిబ్రవరి 2026
  • హాల్ టికెట్లు విడుదల - 10 మార్చి 2026
  • ఎంట్రెన్స్ ఎగ్జామ్ - 4 మార్చి 2026
  • ఎంపిక విధానం - రాత పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
  • ఫస్ట్ మెరిట్ లిస్ట్ - 24 మార్చి 2026
  • తుది ఫలితాలు (ఎంపికైన విద్యార్థుల జాబితా) 29 మార్చి 2026
  • ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన ఉంటుంది.
  • ఎంట్రెన్స్ ఎగ్జామ్ 100 మార్కులకు నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియాలో ప్రశ్నాపత్రం ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://aptwgurukulam.ap.gov.in/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More