నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల సమయాలను పొడిగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉత్తర్వుల ప్రకారం, మద్యం రిటైల్ దుకాణాలు రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించడానికి అనుమతి ఉంటుంది, బార్లు తెల్లవారుజామున 1 గంట వరకు మద్యం అందించడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 తేదీలలో ఏ4 మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఇంకా 2బీ లైసెన్స్‌లు కలిగి ఉన్న బార్‌లు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీ1 (ఇన్-హౌస్) లైసెన్స్‌లు, ఈపీ1 (ఈవెంట్ పర్మిట్) లైసెన్స్‌లు, టీడీ1 (ఇన్-హౌస్) లైసెన్స్‌లు కలిగి ఉన్న సంస్థలు, జనవరి 1, 2026న తెల్లవారుజామున 1 గంట వరకు మద్యం అమ్మడానికి అనుమతి ఉంది.
ఇటీవల ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, ఇంకా... లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు... తదితర అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. బార్ ఏఆర్ఈటీ (అడిషనల్ రిటెయిల్ ఎక్సైజ్ టాక్స్) మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.
అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు రూ.8,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయం లక్ష్యం పెట్టుకోగా, రూ.7,041 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం పెరుగుదల కనిపించిందని... ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) విక్రయాలు 19.08 శాతం, బీర్ విక్రయాలు 94.93 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు.
{{/usCountry}}అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు రూ.8,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయం లక్ష్యం పెట్టుకోగా, రూ.7,041 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం పెరుగుదల కనిపించిందని... ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) విక్రయాలు 19.08 శాతం, బీర్ విక్రయాలు 94.93 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు.
{{/usCountry}}