ఏపీ పెన్షన్ దారులకు అలర్ట్ - ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బుల పంపిణీ..!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్‌ను డిసెంబర్ 31న పంపిణీ చేయనుంది. అంటే ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు డబ్బులు అందుతాయి.
న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక పెన్షన్లను ఒక్క రోజు ముందుగానే అందించనుంది. అంటే జనవరి 1వ తేదీన కాకుండా… డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు డబ్బులను పంపిణీ చేయనున్నారు.

పెన్షన్లకు సంబంధించిన నగదును డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా డీఆర్‌డీఏ పీడీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే చూసుకోవాలని సూచించింది.
ఏపీలో కూటమి సర్కార్ ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో పెన్షన్లు అందజేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు తదితర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా భద్రత కల్పిస్తోంది.
ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ 1వ తేదీ ఏదైనా పబ్లిక్ హాలీడే ఉంటే.. అంతకంటే ముందే (ముందు నెల 30 లేదా 31) పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నారు.పింఛన్ రకాన్ని బట్టి ప్రస్తుతం రూ. 4000 నుంచి రూ. 15000 వరకు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

