...
...
Next Story

ఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ : గడువు పొడిగించిన సర్కార్ - ఇవిగో వివరాలు

ఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించి ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు గడువును మరో 3 నెలలు పొడిగించింది. ఈ మేరకు తాజాగానే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 23వ తేదీతో గడువు ముగిసినే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Published on: Nov 1, 2025, 08:54:41 IST
Advertisement

లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈనెల 23తో గడువు ముగియగా.. ఇప్పుడు 2026 జనవరి 23 వరకు పొడిగించారు.

ఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్
ఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్

అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ సర్కార్ ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. ఈ ఏడాది జులై నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇస్తున్నారు. గడిచిన ఈ 3 నెలల కాలంలో.... 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు గడువు పొడిగించడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

ప్లాట్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ ఛార్జీలు ఉంటాయి. 10 శాతం ఓపెన్ స్పేస్ లేకపోతే 14 శాతం అదనపు ఛార్జీలు విధిస్తారు. పాత ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు కూడా అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన పోర్టల్‌ https:/rsdtcp.ap.gov.in ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

క్రమబద్ధీకరణకు నిర్ణయించిన ఫీజులను దరఖాస్తు చేసిన 45 రోజుల్లోగా చెల్లిస్తే ఫీజు మొత్తంలో 10 శాతం రాయితీ ఉంటుంది. 90 రోజుల్లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుంది. ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులకు కేటాయించిన భూములు, గ్రీన్‌ బఫర్‌ జోన్లు, తీరప్రాంత నియంత్రణ మండలి పరిధిలో ప్లాట్లు, లేఔట్లలో ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతించరు.

ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లు అప్లికేషన్ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగా https://lrsdtcp.ap.gov.in//login? వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే సెర్చ్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ ఆప్షన్ పై నొక్కితే మీ వివరాలను డిస్ ప్లే అవుతాయి. మీ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు.

హెల్ప్ లైన్ నెంబర్….

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks