...
...
Next Story

స్వర్ణాంధ్ర 2047 కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Jun 10, 2025, 15:47:54 IST
By ,
Prefer HTon Google
Advertisement

స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు ఉంటారు. కో ఛైర్మన్‌గా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో ఆసుపత్రి వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, సతీశ్ రెడ్డి, జీఎం రావు, ఎల్అండ్‌టీ ఛైర్మన్ సుబ్రమణ్యన్, టీవీఎస్ మోటర్ ఛైర్మన్ వేణు శ్రీనివాస్, సీఎస్ విజయానంద్ ఉండనున్నారు.

చంద్రబాబు (AP CMO)
చంద్రబాబు (AP CMO)

ఇప్పటికే స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించడానికి 26 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం నుండి ప్రారంభించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులను ఉద్దేశించి ఆన్లైన్ వీడియో మోడ్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్వర్ణాంధ్రను విస్తృత దృక్పథంలో సాకారం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా సంబంధిత జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడానికి ఈ యూనిట్లు పనిచేస్తాయని అన్నారు.

ప్రతి యూనిట్‌లో తొమ్మిది మంది సభ్యుల బృందం ఉంటుందని సీఎం వివరించారు. నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళిక విభాగానికి ఎమ్మెల్యే అధ్యక్షుడిగా, నియోజకవర్గ ప్రత్యేక అధికారి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఉంటారు. స్థానిక సంస్థల నుండి సంబంధిత ఎమ్మెల్సీ, మునిసిపాలిటీ/నగర పంచాయతీ చైర్‌పర్సన్, ఆర్డీఓ/సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రతి యూనిట్‌లో తొమ్మిది మంది ఉంటారు. వీరిలో ఎమ్మెల్యే, జిల్లా నోడల్ అధికారి, ఒక విద్యావేత్త, ఒక యువ ప్రొఫెషనల్, గ్రామ సచివాలయాలు, వార్డ్ సచివాలయాలకు చెందిన ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

స్వర్ణాంధ్ర-2047 నుండి పేదరికం లేని సమాజ స్థాపన, ఉపాధి కల్పన, మానవ వనరుల అభివృద్ధికి నైపుణ్య శిక్షణ, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాల లాజిస్టిక్స్ అభివృద్ధి, ఇంధన వనరుల సమర్థవంతమైన వినియోగం, ఉత్పత్తుల నాణ్యమైన బ్రాండింగ్, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి 10 లక్ష్యాలను చంద్రబాబు చెప్పారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe