ఏపీ సీఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు - ఉత్తర్వులు జారీ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పదవీకాలాన్ని 3 నెలలు పొడిగించారు. ఈ మేరకు కేంద్రం కూడా ఆమోదం తెలపటంతో… రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాలతో 2026 ఫిబ్రవరి 28 వరకు ఆయన సీఎస్‌గా కొన‌సాగ‌నున్నారు.

Published on: Nov 30, 2025, 13:56:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు పొడిగించారు. డిసెంబరు 1వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ శనివారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 2230 ద్వారా ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర ప్రభుత్వం సిఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు మాసాల పాటు పొడిగించేంచేందుకు ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

సిఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు
సిఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు

3 నెలలు పొడిగింపు…

వాస్తవానికి ఈనెల 30న సిఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తి మేరకు ఆయన పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు అనగా డిశంబరు 1నుండి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు పోడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కావున వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు సిఎస్ విజయానంద్ పదవిలో కొనసాగుతారు.

అనంతరం వచ్చే 2026 మార్చి 1వ తేదీ నుండి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ప్రస్తుత రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సియంఓ ఇఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ను నియమిస్తూ ఇదే ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.విజయానంద్ పదవీ విరమణ అనంతరం 2026 మార్చి 1వ తేది నుండి తదుపరి సిఎస్ గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు చేపడతారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More