ఏపీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - త్వరలో నోటిఫికేషన్లు...!

ఏపీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఎస్సై పోస్టులు 19 ఉండగా… కానిస్టేబుల్ ఖాళీలు 245 ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Published on: Nov 7, 2025, 11:24:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక పోలీసు దళం(Andhra Pradesh Special Police)లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు విడతల్లో ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటిల్లో 19 ఎస్సై పోస్టులుండగా…. 245 కానిస్టేబుల్‌ ఖాళీలున్నాయి.

ఏపీఎస్పీలో ఖాళీలు - భర్తీకి సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌
ఏపీఎస్పీలో ఖాళీలు - భర్తీకి సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌

విడతల వారీగా…

ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటన వివరాల ప్రకారం… 2026-27 ఆర్థిక సంవత్సరంలో 10 ఎస్సై పోస్టులు, 125 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక రెండో విడత కింద అంటే 2027-28లో 9 ఎస్సై ఖాళీలు, 120 కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఖాళీల భర్తీ ప్రక్రియను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో… పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు త్వరలో నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించి… రాత పరీక్షలతో పాటు ఫిజికల్ టెస్టులను నిర్వహిస్తోంది. మెరిట్ ఉన్న వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఈ పోస్టుల భర్తీపై పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా అప్డేట్స్ తో పాటు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ల వివరాల కోసం https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More