...
...
Next Story

అమరావతి, అరకు లోయలో ప్రధాన పర్యాటక ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు!

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కీలక ప్రాజెక్టులకు ప్రోత్సహకాలు అందిస్తోంది.

Published on: Oct 17, 2025, 05:47:17 IST
Advertisement

పర్యాటక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఆమోదించింది. రాష్ట్ర పర్యాటక విధానం 2024-2029 కింద వివిధ ప్రధాన ప్రాజెక్టులకు ప్రతిపాదనలను ఆమోదించింది. వీటిలో అమరావతిలోని లగ్జరీ హోటళ్లు, అరకు లోయలోని ఒక ఎకో-లగ్జరీ రిసార్ట్ ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అమరావతిలో రూ.177 కోట్లతో కోర్ట్ యార్డ్ బై మారియట్ హోటల్‌ను అభివృద్ధి చేయడానికి మెస్సర్స్ సదరన్ గ్లోబ్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలు మంజూరు అయ్యాయి. దీనికి 10 సంవత్సరాల పాటు 100 శాతం నికర ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ లేదా స్థిర మూలధన పెట్టుబడి తిరిగి పొందే వరకు, 10 శాతం మూలధన పెట్టుబడి సబ్సిడీని రూ.10 కోట్లకు పరిమితం చేయడం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, పరిశ్రమ-రేటు విద్యుత్, ఆస్తి పన్ను ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలు అందిస్తారు. ఈ ప్రాజెక్టు దాదాపు 600 ఉద్యోగాలను సృష్టిస్తుందని, 24 నెలల్లో పూర్తవుతుందని అంచనా.

అమరావతిలో రూ.200 కోట్లతో 4-స్టార్ దస్పల్లా హోటల్‌ను ప్లాన్ చేస్తున్న దస్పల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇలాంటి ప్రోత్సాహకాలను పొందింది. వాటిలో ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, స్టాంప్ డ్యూటీ ప్రయోజనాలు, విద్యుత్ సబ్సిడీలు ఉన్నాయి. దీనితో 400 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్ట్ కాలక్రమం 24 నెలలుగా నిర్ణయించారు.

అరకు లోయలో రూ.55.84 కోట్ల విలువైన పర్యావరణ రిసార్ట్‌ను అభివృద్ధికి మెస్సర్స్ వీఎస్‌కే హోటల్స్ & రిసార్ట్స్ ఎల్ఎల్‌పీకి ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ప్రోత్సాహకాలలో 100 శాతం ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఐదు విడతల్లో రూ.10 కోట్ల స్థిర మూలధన సబ్సిడీ, ఐదు సంవత్సరాల పాటు విద్యుత్ సుంకం రీయింబర్స్‌మెంట్, సింగిల్ విండో మద్దతు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ 98 ప్రత్యక్ష ఉద్యోగాలను, 100 పరోక్ష ఉద్యోగాలను సృష్టించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe