విద్యార్థులకు ‘రాకెట్ తయారీ’ పోటీలు..! ఈ లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

విద్యార్థుల్లో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికి తీసేందుకు దక్షిణ భారత రాకెట్రీ ఛాలెంజ్‌ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.జనవరి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తారు. http://www.sciencecity.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Published on: Dec 24, 2025, 13:33:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విద్యార్ధులు, కాలేజీ యువతలో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికి తీసేలా సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ పోటీలను రాష్ట్రప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సంబంధించి సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు.

సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2026
సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2026

3 రోజుల పాటు పోటీలు….

ప్రభుత్వ ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫైనల్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆధ్వర్యంలో మొట్టమొదటి సారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, రవాణా, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు… సీఎం చంద్రబాబుకు వివరించారు.

అర్హులు… రిజిస్ట్రేషన్ వివరాలు

కాలేజీ స్థాయిలో కెమికల్ రాకెట్రీ, పాఠశాల స్థాయిలో హైడ్రో రాకెట్రీ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కెమికల్ రాకెట్రీ విభాగంలో 16 ఏళ్లకు పైబడిన వారు, హైడ్రో రాకెట్రీ విభాగంలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న వారు పాల్గొననున్నారని తెలిపారు.

కళాశాల యువత,తో పాటు పాఠశాల విద్యార్ధుల్లో నూతన ఆవిష్కరణల్ని, ఆలోచనల్ని వెలికి తీసేలా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తెలియచేసింది. రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ సైన్స్ సిటీ డాట్ గవ్ డాట్ ఇన్ రాకెట్రీ ఛాలెంజ్( http://www.sciencecity.ap.gov.in/rocketry_challenge.aspx )వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More