AP Govt Annadata Sukhibhava Scheme : ఏపీలో 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం మొదటి విడత నిధులను ప్రభుత్వం నేడు (శనివారం) విడుదల చేయనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో ఈ పెట్టుబడి సాయం అందడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు పెద్ద ఊరట లభించనుంది.
ఈ విడతలో రూ.3,125.47 కోట్లు

ఈ విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. లబ్ధిదారుల్లో 45,69,817 మంది భూ యజమానులైన రైతులు ఉండగా, అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేసుకుంటున్న 1,16,021 మంది గిరిజన రైతు కుటుంబాలు కూడా ఉన్నారు. నేడు రైతుల ఖాతాల్లో మొత్తం రూ.3,125.47 కోట్లు జమ కానున్నాయి. ఈ నిధుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా…. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద తన వాటాగా రూ.782.55 కోట్లు సమకూరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకం కింద ప్రభుత్వం రూ.8,985.41 కోట్లను విజయవంతంగా పంపిణీ చేసింది. అందులో రాష్ట్ర వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర వాటా రూ.2,425.23 కోట్లుగా ఉంది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభవ పథకం అత్యంత కీలకమైనది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి రూ.14,000 ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రూ.6,000 అందిస్తోంది. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మూడు విడతల్లో లబ్ధిదారులకు అందజేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5,000, కేంద్ర పీఎం కిసాన్ వాటా రూ.2,000 కలిపి ప్రతి రైతు అకౌంట్ లోనూ ఒకేసారి రూ.7,000 చొప్పున డిపాజిట్ చేస్తారు.
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో పర్యటించనున్నారు. టూర్ షెడ్యూల్ వివరాలివే…
- ఉదయం 11.55 గంటలకు అమరావతిలోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ అందుతున్న సేవలను, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
- మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు స్థానిక రైతులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను, వ్యవసాయ పరిస్థితులను తెలుసుకుంటారు.
- మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
- సాయంత్రం 3.50 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ ప్రజావేదిక సభలో పాల్గొని రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అన్నదాత సుఖీభవ - స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- ముందుగా https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్‌పేజీలోని “Know Your Status” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే ఉన్న క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి.
- సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- ఇక్కడ వివరాలు డిస్ ప్లే కాకుండా ఏమైనా సమస్య ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది