...
...
Next Story

AP High Court Recruitment 2026 : నిరుద్యోగులకు అలర్ట్ - ఏపీ హైకోర్టులో కోర్టు మాస్టర్‌ ఉద్యోగాలు, దరఖాస్తు తేదీలివే

AP High Court Recruitment 2026 : కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 32 ఖాళీలున్నాయి. దరఖాస్తులకు ఏప్రిల్ 17 వరకు గడువు ఉంది.

Published on: Mar 26, 2026, 06:59:36 IST
Advertisement

ఏపీ హైకోర్టు నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. డైరెక్ట్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

మొత్తం 32 ఖాళీలు…

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు 20, బదిలీ ద్వారా 12 పోస్టులను రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 17 వరకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల 'లా' డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నిమిషానికి 180 పదాలు ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో టైపింగ్ చేయాలి. లేదా 150 డబ్ల్యూపీఎం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషానికి 45 పదాల వేగంతో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి.ఎంపికైన వారికి నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు.

అప్లికేషన్ విధానం…

ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తుతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ కాపీలు తప్పనిసరిగా ఉండాలి. పుట్టిన తేదీ ధ్రువపత్రం, డిగ్రీ సర్టిఫికెట్, షార్ట్ హ్యాండ్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటంది. https://aphc.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వివరాలను నింపి… “రిజిస్ట్రార్, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, గుంటూరు జిల్లా, పిన్ కోర్డ్ - 522239” చిరునామాకు పంపించాలి.

ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ… మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://aphc.gov.in/index.php వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe