ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్ - ఇదే ఫైనల్ ఛాన్స్, ఆలస్యం చేయకండి..!
ఏపీ ఇంటర్ విద్యార్థులకు మరో అప్డేట్ వచ్చింది. పరీక్ష ఫీజు చెల్లింపు కోసం మరో అవకాశం కల్పించారు. ఈనెల 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 5లోగా అపరాధ రుసుంతో తత్కాల్ కింద రూ. 5000 చెల్లించి పరీక్షలకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుపై అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువు ముగిసినప్పటికీ…. తత్కాల్ స్కీమ్‌ను కింద విద్యార్థులకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి ప్రకటన జారీ అయింది.

తాజా ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం…. జనరల్, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రూ.5,000 ఫైన్‌తో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ తేదీల తర్వాత మళ్లీ ఎలాంటి అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షలు ఎప్పుడంటే…?
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య నిర్వహిస్తారు.
ఇక ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు. సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 10వ తేదీతో ముగుస్తాయి. ఈ పరీక్షలు పూర్తి అయ్యాక… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు.
ఏపీ ఇంటర్ 2026 - ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 23 - ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- ఫిబ్రవరి 25 - ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1
- ఫిబ్రవరి 27 - ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ 1
- మార్చి 2 - ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 1
- మార్చి 5 - ఫస్ట్ ఇయర్ జూవాలజీ/ మ్యాథ్స్ 1బి
- మార్చి 7 - ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 1
- మార్చి 10- ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1
- మార్చి 12 - ఫస్ట్ ఇయర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1
- మార్చి 14- ఫస్ట్ ఇయర్ సివిక్స్ 1
- మార్చి 17 - ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 1
- మార్చి 20 - ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1
- మార్చి 24 - ఫస్ట్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1
ఏపీ ఇంటర్ 2026 - సెకండ్ ఇయర్ షెడ్యూల్ :
ఫిబ్రవరి 24 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
ఫిబ్రవరి 26 - ఇంగ్లీషు పేపర్ 2
ఫిబ్రవరి 28 - సెకండ్ ఇయర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2
మార్చి 3 - సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2
మార్చి 6 - సెకండ్ ఇయర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2
మార్చి 9- సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2బి
మార్చి 11- సెకండ్ ఇయర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2
మార్చి 13- సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2
మార్చి 16 - సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2
మార్చి 18 - సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2
మార్చి 21- సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

