AP Inter Exams 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - జనవరి 5 వరకు ఫీజు చెల్లించుకునే ఛాన్స్..! ఇదే ఫైనల్

ఏపీ ఇంటర్మీడియట్ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. తాత్కల్ స్కీమ్ కింద రూ. 5 వేల ఫైన్ తో జనవరి 5వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Published on: Dec 20, 2025, 12:24:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుపై ఇంటర్మీడియట్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువు ముగిసినప్పటికీ…. తత్కాల్ స్కీమ్‌ను కింద విద్యార్థులకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు జనవరి 5, 2026తో ముగియనుంది. ఆ తర్వాత ఎలాంటి గడువు పొడిగింపు ఉండని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని మిగిలిపోయిన విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించింది.

ఏపీ ఇంటర్ ఎగ్జామ్ ఫీజు
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ ఫీజు

ఎగ్జామ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు….

ఏపీ ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు మరో ప్రకటన విడుదల చేసింది. సెకండ్ ఇయర్ గణితం పేపర్‌-2ఏ, సివిక్స్‌ పేపర్‌-2 పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 3న జరగాల్సి ఉంది. ఈ పరీక్షలను మార్చి 4కు మార్చారు. ప్రభుత్వ క్యాలెండర్‌లో హోలీ పండుగ మార్చి 3న ఉండడంతో ఈ మార్పు చేశారు.

మార్చి 20వ తేదీన జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్‌ పరీక్షలను 21వ తేదీకి షిప్ట్ చేశారు. మార్చి 20న రంజాన్‌ పండుగ కావడంతో ఈ మార్పు జరిగింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది సిలబస్‌ మారడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులకు ప్రత్యేకంగా షెడ్యూల్‌ ఇచ్చారు.

ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. ఇక ఇక ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు పూర్తి అయ్యాక… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More