AP LAWCET 2026 : ఏపీ లాసెట్ దరఖాస్తులు ప్రారంభం - మేలో ఎగ్జామ్, ఇలా అప్లయ్ చేసుకోండి
ఏపీ లాసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి.
ఏపీలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గురువారం (ఫిబ్రవరి 12) నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ ఏడాది లాసెట్ - 2026 పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి మూడేళ్ల లా, ఐదేళ్ల లా, పీజీ లా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
అర్హులైన అభ్యర్ధులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే మార్చి 28వ తేదీ వరకు అవకాశం ఉంది, లాసెట్ ప్రవేశ పరీక్ష మే 4వ తేదీన నిర్వహిస్తారు.
ఏపీ లాసెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్
- అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా అప్లికేషన్ ఫీజు ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లింపు వివరాల ఆధారంగా అప్లికేషన్ ఫారమ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- ఇక్కడ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను నమోదు చేయాలి.
- అభ్యర్థి ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే ఏపీ లాసెట్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
ఏపీ లాసెట్ నోటిఫికేషన్ - ముఖ్యమైన తేదీలు:
- ఎంట్రెన్స్ ఎగ్జామ్ - ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్) - 2026
- కోర్సులు: మూడేళ్లు/ 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం(LLM).
- కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు లా డిగ్రీ ఉండాలి.
- దరఖాస్తు ప్రాసెస్ - ఆన్ లైన్
- దరఖాస్తులకు చివరి తేదీ - 12 మార్చి 2026.
- రూ.2000 ఫైన్ తో దరఖాస్తు చివరి తేది - 20 మార్చి 2026.
- రూ.4000 ఫైన్ తో దరఖాస్తు చివరి తేది - 24 మార్చి 2026.
- రూ.10000 ఫైన్ తో దరఖాస్తు చివరి తేది - 28 మార్చి 2026.
- అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 30 మార్చి 2026.
- హాల్ టికెట్ డౌన్లోడ్ - 20 ఏప్రిల్ 2026.
- లాసెట్ ఎగ్జామ్ తేదీ - 4 మే 2026.
- ప్రాథమిక కీ విడుదల - 7 మే 2026 .
- ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల - 18 మే 2026.
- అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

