లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అటాచ్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతడి కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated on: Nov 19, 2025, 15:26:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుంభకోణం వైసీపీ పాలనలో జరిగింది. సిట్ ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రతి అడుగుతో కొత్త లింకులు బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్‌లో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

అంతకుముందు దర్యాప్తులో భాగంగా అధికారులు A1 రాజ్ కాసిరెడ్డి ఆస్తులను జప్తు చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి ఆస్తులను కూడా అధికారులు జప్తు చేస్తారు. కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మీ ఆస్తులను కూడా జప్తు చేయాలని నిర్ణయించారు. ఓ వైపు వైసీపీ దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది.

2025 సెప్టెంబర్‌లో చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లోని భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలు, కంపెనీలపై సిట్ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఆ బృందం హైదరాబాద్‌లోని షాబాద్‌లో రూ.150 కోట్ల విలువైన 90 ఎకరాలు, గచ్చిబౌలిలో రూ.15 కోట్ల విలువైన 326 చదరపు గజాలను స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రతిపాదనను రూపొందించింది. మోహిత్ రెడ్డి కంపెనీలతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్న షెల్ కంపెనీ వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బేవరేజెస్‌తో సంబంధాలను కూడా సిట్ గుర్తించింది.

షెల్ ఆపరేషన్ల ద్వారా మనీలాండరింగ్ జరిగినట్లు అధికారులు ఆధారాలను కనుగొన్నారు. 2024లో అధికారులు చెక్‌పోస్ట్‌లో రూ.8 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి చెవిరెడ్డితో కూడా సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం ఇప్పుడు చెవిరెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తోంది.

మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని దర్యాప్తులో తేలింది. అయితే ఇందులో 8 కోట్లకుపైగా తగ్గించారని సిట్ గుర్తించింది. మిగిలిన 54 కోట్లకుపైగా ఆస్తిని బ్లాక్‌ మనీగా మలిచారని అధికారులు తెలుసుకున్నారు. ఎక్కువ మెుత్తాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టాని అంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు జాయింట్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా బయటపడింది. మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్టుగా సిట్ గుర్తించింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఆస్తులు అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More