ఏపీ LRS స్కీమ్ : మరో 3 రోజులే గడువు - డిస్కౌంట్ ఛాన్స్ మిస్ కాకండి
లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) గడవు దగ్గరపడింది. 2026 జనవరి 23 వరకు అవకాశం ఉంటుంది. ఈలోపు ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వారికి ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఉంటుంది.
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ సర్కార్ ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. గతేడాది జులై నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇస్తున్నారు. అయితే ఈ గడువు పలుమార్లు పొడిగించారు. అయితే పొడింపు సమయం కూడా దగ్గరపడింది. ఈనెల 23వ తేదీతో ఎల్ఆర్ఎస్ గడువు పూర్తవుతుంది. కాబట్టి అర్హులైన వాళ్లు… వెంటనే ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ పథకం ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమబద్ధీకరణతో 75 వేల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ నెల 23లోపు ఫీజులు చెల్లిస్తే డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వారికి ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో ప్రభుత్వం 50 శాతం రాయితీ ప్రకటించింది. ఓపెన్ స్పేస్ ఛార్జీ కింద ప్లాట్ మొత్తం విలువలో 14శాతానికి బదులు7 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అయితే సంబంధిత ఛార్జీలను ఈనెల 23వ తేదీలోపు చెల్లించే వారికి మాత్రమే వర్తిస్తుంది. గడువు ముగిశాక క్రమబద్ధీకరించుకోవాలంటే ఓపెన్ స్పేస్ ఛార్జీలు 14 శాతం కట్టాల్సి ఉంటుంది. పైగా బెటర్‌మెంట్ ఛార్జీలు, ఇతర రుసుముల మొత్తంపైనా మళ్లీ అపరాధ రుసుములు విధిస్తారు.
ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులకు కేటాయించిన భూములు, గ్రీన్ బఫర్ జోన్లు, తీరప్రాంత నియంత్రణ మండలి పరిధిలో ప్లాట్లు, లేఔట్లలో ఎల్‌ఆర్‌ఎస్ అనుమతించరు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. నిబంధనలకు లోబడి ఉన్న ఫ్లాట్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు.
ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లు అప్లికేషన్ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగా https://lrsdtcp.ap.gov.in//login? వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే సెర్చ్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ ఆప్షన్ పై నొక్కితే మీ వివరాలను డిస్ ప్లే అవుతాయి. మీ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు.
దరఖాస్తుదారులకు కావాల్సిన సమాచారం ఇచ్చే దిశగా ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా తీసుకోవచ్చింది. ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ లో సమస్యలు ఉంటే… 7981651881 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ నెంబర్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

