AP MPTC ZPTC Elections Live : ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

Nov 5, 2026, 18:20:09 IST

AP MPTC ZPTC Elections : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. వర్షాలు ఉన్నా.. ఎస్ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరిమిత సంఖ్యలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు.

Summary

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల పోలింగ్ నడుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్
ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో మొత్తం 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,61,52,377 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 38 వేల మంది పోలీసులతో భద్రత ఉంది.

Follow all the updates here:
  • 5 Nov 2026, 06:20:08 PM IST

    పోలింగ్ అధికారిణి మృతిపై చంద్రబాబు విచారం

    అనంతపురం జిల్లా కుడేరు మండలం కడదరకుంటలో పోలింగ్ విధుల్లో ఉండగా గుండెపోటుతో పోలింగ్ అధికారి హరిత మృతిచెందారు. మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. హరిత డి.హీరేహళ్ మండలం పూలకుర్తిలో హరిత టీచర్‌గా పని చేస్తున్నారు.

  • 5 Nov 2026, 06:17:16 PM IST

    తిరుపతి సప్తగిరి కాలనీలో చెవిరెడ్డి ఆందోళన

    తిరుపతి సప్తగిరి కాలనీలో వైసీపీ నేత చెవిరెడ్డి ఆందోళన చేశారు. 115, 116, 117 బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని బైఠాయించారు.

  • 5 Nov 2026, 05:32:32 PM IST

    ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

    ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 582 జడ్పీటీసీ, 7762 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. క్యూలైన్లలోఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

  • 5 Nov 2026, 05:29:48 PM IST

    టీడీపీ-బీజేపీ గొడవ

    కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. కారంపొడి చల్లి రాళ్లు, కర్రలతో ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు.

  • 5 Nov 2026, 05:27:01 PM IST

    3 గంటల వరకు 58.55 శాతం పోలింగ్

    మూడు గంటల వరకు పరిషత్ ఎన్నికల్లో 58.55 శాతం పోలింగ్ నమోదైంది.

  • 5 Nov 2026, 04:29:45 PM IST

    గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి

    అనంతపురం జిల్లా కూడేరు మండలం కదరకుంటలో పోలింగ్ అధికారిణి మృతిచెందారు. ఏపీవో విధులు చూసుకుంటున్న హరిత గౌడ్ అనే వ్కక్తికి గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందారు.

  • 5 Nov 2026, 04:25:12 PM IST

    పరిషత్ ఎన్నికలపై జగన్ కామెంట్స్

    ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాబోయే తరాలకు తప్పుడు సందేశం ఇస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అధికార దుర్వినియోగంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. శకుని మాయాపాచికల మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఇవి ఎలక్షన్లా.. సెలక్షన్లా అంటూ ఎద్దేవా చేశారు.

  • 5 Nov 2026, 04:17:13 PM IST

    ఓటువేసిన 102 ఏళ్ల వృద్ధురాలు

    అనంతపురం జిల్లా తాడిపత్రిలో గన్నవారిపల్లెకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు దస్తగిరమ్మ ఓటువేశారు. ఆమె కోరిక మేరకు ద్విచక్రవాహనంపై మాజీ సర్పంచ్ తీసుకొచ్చారు.

  • 5 Nov 2026, 03:29:10 PM IST

    టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి

    చిత్తూరు కుప్పంలోని నడమూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పళణిపై దాడి జరిగింది. గాయపడిన పళణిని ఆసుపత్రికి తరలించారు.

  • 5 Nov 2026, 03:27:08 PM IST

    మేం ఉన్నాం..ఓటేయండి : సీఐ

    చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపలపల్లి పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటు కూడా నమోదుకాలేదు. సీఐ తిమ్మయ్య గ్రామంలో తిరుగుతూ.. ఓటర్లు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • 5 Nov 2026, 02:25:18 PM IST

    ఓటు వేసిన మంత్రి అనిత

    పరిషత్ ఎన్నికల్లో హోమంత్రి అనిత సాధారణ పౌరురాలిగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు.

  • 5 Nov 2026, 01:48:29 PM IST

    కళ్లలో కారం కొట్టిన మహిళలు

    ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ కడప జిల్లా నందలూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బయటి వ్యక్తులు ఊర్లోకి వచ్చారు. వారిపై దాడి చేసిన గ్రామస్థులు.. కారు అద్దాలు పగలగొట్టారు. వాహనంలోని వ్యక్తుల కళ్లలోమహిళలు కారం కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

  • 5 Nov 2026, 12:47:57 PM IST

    ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు

    పరిషత్ ఎన్నికలను చిత్తూరు జిల్లా ఐరాల మండలం అబ్బుగుండు గ్రామస్థులు బహిష్కరించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

  • 5 Nov 2026, 12:14:22 PM IST

    ఉదయం 11 గంటలకు పోలింగ్

    ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 21.12 శాతం పోలింగ్ నమోదైంది.

  • 5 Nov 2026, 12:13:03 PM IST

    వాహనాల్లో రౌడీలు

    కడప జిల్లా నందలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నుంచి రౌడీలు వచ్చారు. వారి వాహనాలను అడ్డుకుని స్థానికులు దాడి చేశారు. పోలీసులకు అప్పగించారు.

  • 5 Nov 2026, 12:11:09 PM IST

    ఎన్నికలు బహిష్కరణ

    అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెంలో పరిషత్ ఎన్నికలు బహిష్కరించారు గ్రామస్థులు. తక్కువ సంఖ్యలో ఉన్న ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడం ఏంటని నిరనస తెలిపారు.

  • 5 Nov 2026, 11:25:31 AM IST

    ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం

    తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో 3 గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. నిన్న కురిసిన భారీ వర్షాలు, వరదతో పోలింగ్ కేంద్రంలో నీరు చేరింది. ఫైర్ ఇంజిన్ సాయంతో నీటిని తొలగించి.. ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు.

  • 5 Nov 2026, 11:15:25 AM IST

    పులివెందులలో పెట్రోల్ బాంబుల దాడి

    కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్ బుత్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

  • 5 Nov 2026, 10:45:17 AM IST

    పోలీసుల ఎదుటే పెట్రోల్ బాంబులతో దాడులు

    తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

  • 5 Nov 2026, 10:42:54 AM IST

    ఉదయం 9 గంటల వరకు 4.8 శాతం పోలింగ్

    రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 4.8 శాతం పోలింగ్ నమోదైంది.

  • 5 Nov 2026, 10:18:21 AM IST

    పార్నపల్లిలో టెన్షన్.. టెన్షన్..

    ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. పులివెందుల పార్నపల్లిలో అనుచరులతో కలిసి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పోలింగ్ కేందం వద్దకు వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అవినాశ్ వాగ్వాదానికి దిగారు.

  • 5 Nov 2026, 09:45:05 AM IST

    టీడీపీ, వైసీపీ రాళ్లదాడి

    మన్యం జిల్లా భామిని మండలం కీసర పోలింగ్ కేంద్రంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కీసర పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.

  • 5 Nov 2026, 09:20:09 AM IST

    భారీ వర్షం

    కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలోకి నీరు చేరింది. దీంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం , చినగంజాంలోనూ వానలు పడుతున్నాయి.

  • 5 Nov 2026, 08:54:21 AM IST

    వర్షంలోనూ కొనసాగుతున్న పోలింగ్

    నెల్లూరు జిల్లా అల్లూరులో మోస్తరు వర్షం పడుతుంది. వర్షంలోనూ పోలింగ్ కొనసాగుతోంది. పలు గ్రామాల్లో ఓటింగ్ వర్షం కురుస్తున్నా.. పోలింగ్ కొనసాగుతోంది.

  • 5 Nov 2026, 08:49:58 AM IST

    ఈ మండలాల్లో వాయిదా

    ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోనూ పూర్తిగా పోలింగ్ వాయిదా వేశారు.

  • 5 Nov 2026, 08:47:58 AM IST

    వర్షాలతో ఇక్కడ పోలింగ్ వాయిదా

    భారీ వర్షాలతో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేశారు. శుక్రవారం పోలింగ్ నిర్వహించి.. శనివారం ఓట్లు లెక్కిస్తారు.

  • 5 Nov 2026, 08:37:35 AM IST

    మెుత్తం బరిలో 21012 మంది

    582 జడ్పీటీసీ, 7767 ఎంపీటీసీ స్థానాలకు మెుత్తం బరిలో 21012 మంది. రాష్ట్రవ్యాప్తంగా 31460 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • 5 Nov 2026, 08:34:38 AM IST

    ఎన్నికలు నిర్వహించని స్థానాలు

    నామినేషన్లు వేయని కారణంగా.. కడప జిల్లాలోని సుగుమంచిపల్లి, కొండాపురం ఎంపీటీసీ స్థానాలకు, నామినేషన్లు తిరస్కరించడంతో నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కృష్ణగిరి ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగట్లేదు.

  • 4 Nov 2026, 10:47:25 PM IST

    2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

    రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో మొత్తం 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

  • 4 Nov 2026, 10:45:59 PM IST

    ఓటర్లు సుమారు 2.61 కోట్లు

    గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగి సుమారు 2.61 కోట్లకు చేరుకుంది.అధికారులు, ఎన్నికల సిబ్బంది ముందస్తు ప్రణాళికతో, క్షేత్రస్థాయిలో సమన్వయంతో వ్యవహరించాలని ఎస్ఈసీ కోరారు. మైక్రో లెవెల్ ప్లానింగ్‌తో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • 4 Nov 2026, 10:44:16 PM IST

    ఎన్నికల విధుల్లో దాదాపు 2.52 లక్షల మంది

    ఎన్నికల విధుల్లో దాదాపు 2.52 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. కౌంటింగ్ కోసం సుమారు 52 వేల మంది సిబ్బంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు. సీసీటీవీ, వీడియోగ్రఫీతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.

  • 4 Nov 2026, 10:42:52 PM IST

    సమస్యాత్మక కేంద్రాలు

    రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9,966 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు , 9,186 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. 35,333 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,41,332 మంది పోలింగ్‌ అధికారులు ఉన్నారు.

  • 4 Nov 2026, 10:41:15 PM IST

    ఉదయం 7 గంటల నుంచి పోలింగ్

    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 38 వేల మంది పోలీసులతో భద్రత ఉంది.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks