Live

AP Municipal Election Results Live Updates : ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - ఓట్ల లెక్కింపు ప్రారంభం

AP Municipal Election Results 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఫలితాలు సాయంత్రం వరకు తేలనున్నాయి. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - లైవ్ అప్డేట్స్
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - లైవ్ అప్డేట్స్

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - 2026

...Read More

Follow all the updates here:
Nov 3, 2026, 08:18:50 IST

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

ఏపీ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.

Nov 3, 2026, 08:04:10 IST

ఓట్ల లెక్కింపు షురూ

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఫలితాలు సాయంత్రం లేదా రాత్రి వరకు తేలనున్నాయి.

Nov 3, 2026, 08:03:32 IST

ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పులివెందుల మున్సిపాలిటీలో రీ-పోలింగ్ జరపాలన్న పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Nov 3, 2026, 07:46:08 IST

సీసీ కెమెరాలతో నిఘా

కౌంటింగ్ విధుల్లో 47,817 మంది సిబ్బంది

కౌంటింగ్ కేంద్రాల్లో 1,372 సీసీ కెమెరాలతో నిఘా

మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 804 వార్డులకు కౌంటింగ్

79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 2,382 వార్డులకు కౌంటింగ్

కార్పొరేషన్ల కౌంటింగ్ కోసం 4,026 టేబుళ్లు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కౌంటింగ్ కోసం 2,805 టేబుళ్లు

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

Nov 3, 2026, 07:45:53 IST

ఓట్ల లెక్కింపు - ముఖ్య వివరాలు

ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు

రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో కౌంటింగ్

13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు

మొత్తం 3,186 వార్డుల్లో ఓట్ల లెక్కింపు

కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల ఏర్పాటు

మొత్తం 556 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు

ఓట్ల లెక్కింపు కోసం 6,831 టేబుళ్ల ఏర్పాటు

Nov 3, 2026, 07:43:50 IST

ఏర్పాట్లు సిద్ధం…

పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అమలాపురం, రామచంద్రపురంలో చెరో 12 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు చోట్లా మూడు రౌండ్లలో కౌంటింగ్ పూర్తిచేయనున్నారు. ముమ్మిడివరంలోని 23 వార్డుల ఓట్లను నాలుగు రౌండ్లలో లెక్కించనున్నారు. వార్డులతో పాటు ఛైర్‌పర్సన్ ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది.

Nov 3, 2026, 07:41:53 IST

విజయవాడ మేయర్ ఎవరో..?

విజయవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. వైసీపీ, కూటమితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా బరిలో ఉన్నారు. దీంతో ఈసారి మేయర్ గా ఎవరికి అవకాశం రానుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Nov 3, 2026, 07:40:30 IST

పోలింగ్ శాతం వివరాలు

రీపోలింగ్ అనంతరం ప్రకటించిన వివరాల ప్రకారం…. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం 62.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదు అయిన 96,89,061 మంది ఓటర్లలో 60,22,411 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికర అంశం వెలుగు చూసింది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి పెద్ద నగరాలతో పోలిస్తే చిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనే ఓటర్లు భారీగా తరలివచ్చి అత్యధిక శాతం ఓటింగ్ నమోదు చేశారు.

Nov 3, 2026, 07:40:11 IST

ఏకగ్రీవాలు ఎన్నంటే…?

రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లకు గానూ 118 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మున్సిపాలిటీల్లోని 3,020 వార్డుల్లో 637 స్థానాలు ఏకగ్రీవంగా మారాయి. ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 2,382 వార్డుల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానాల్లో విజయం సాధించేందుకు మొత్తం 10,262 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరి రాజకీయ భవితవ్యం కొన్ని గంటల్లోనే తేలనుంది.

Nov 3, 2026, 07:39:51 IST

138 కౌంటింగ్ కేంద్రాలు….

మొత్తం 92 పురపాలికల్లో పోలింగ్ ప్రక్రియ ముగియగా, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేందుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటి పరిధిలో 556 కౌంటింగ్ హాళ్లను నిర్మించి, మొత్తం 6,831 కౌంటింగ్ టేబుళ్లను అందుబాటులోకి తెచ్చారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు భారీ ఎత్తున మానవ వనరులను వినియోగిస్తున్నారు.

కౌంటింగ్ పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు : 6,831 మందిప్రధాన

కౌంటింగ్ సిబ్బంది: 13,662 మంది

కౌంటింగ్ సహాయకులు (అసిస్టెంట్లు): 27,324 మంది

Nov 3, 2026, 07:38:36 IST

తేలనున్న భవితవ్యం…

ఈ పట్టణ పోరులో ప్రధాన పార్టీలైన అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పట్టణ ప్రాంత ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది మరికొద్ది గంటల్లో స్పష్టం కానుంది.

Nov 3, 2026, 07:38:21 IST

భారీ బందోబస్తు

లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి, సీసీటీవీ కెమెరాల నిఘా ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Nov 3, 2026, 07:38:06 IST

రాత్రి వరకు పూర్తి ఫలితాలు

పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలుకాగా, ప్రాథమిక సరళి (ట్రెండ్స్) మధ్యాహ్నం 12 గంటల నాటికి స్పష్టమయ్యే అవకాశం ఉంది. మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల భవితవ్యంపై రాత్రి సమయానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.

Nov 3, 2026, 07:37:51 IST

పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్

రాష్ట్రంలోని 92 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం సరిగ్గా 8:00 గంటలకు ప్రారంభం కానుంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల్లో పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) సర్వం సిద్ధం చేసింది.

Nov 3, 2026, 07:36:59 IST

నేడే ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఫలితాలు సాయంత్రం వరకు తేలనున్నాయి.

Home Andhra pradesh AP Municipal Election Results Live Updates : ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - ఓట్ల లెక్కింపు ప్రారంభం