ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో పూర్తయింది. చివరి రోజైన ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద వరుసలో ఉన్న అభ్యర్థులందరి పత్రాలను అధికారులు స్వీకరించారు.

అంతిమ గడువు ముగియడంతో అన్ని ప్రధాన పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం అక్టోబర్ 19న అధికారులు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన చేపడతారు.
పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు.
అక్టోబర్ 30వ తేదీన ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలలో (13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు) మొత్తం 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ పూర్తవడంతో అభ్యర్థుల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్బన్ స్థానిక పోరు ముగిసిన వెంటనే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తదుపరి దశల పోలింగ్ ప్రక్రియ వరుసగా ప్రారంభం కానుంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్
రెండో దశ కింద ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 19న వస్తుంది. నామినేషన్ల తుది గడువు 23, నామినేషన్ల ఉపసంహరణ 27 వరకు ఉంటుంది. పోలింగ్ తేదీ నవంబర్ 3 ఉండగా.. ఫలితాలు నవంబర్ 5న వెల్లడిస్తారు.
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
{{/usCountry}}రెండో దశ కింద ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 19న వస్తుంది. నామినేషన్ల తుది గడువు 23, నామినేషన్ల ఉపసంహరణ 27 వరకు ఉంటుంది. పోలింగ్ తేదీ నవంబర్ 3 ఉండగా.. ఫలితాలు నవంబర్ 5న వెల్లడిస్తారు.
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
{{/usCountry}}గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన రోజు సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
తొలి విడత
నోటిఫికేషన్: నవంబరు 13
నామినేషన్ల గడువు: నవంబరు 17 (ఉపసంహరణ: నవంబరు 21)
పోలింగ్ & లెక్కింపు: నవంబరు 26
రెండో విడత
నోటిఫికేషన్: నవంబరు 18
నామినేషన్ల గడువు: నవంబరు 20 (ఉపసంహరణ: నవంబరు 24)
పోలింగ్ & లెక్కింపు: నవంబరు 29
మూడో విడత
నోటిఫికేషన్: నవంబరు 19
నామినేషన్ల గడువు: నవంబరు 23 (ఉపసంహరణ: నవంబరు 27)
పోలింగ్ & లెక్కింపు: డిసెంబరు 2